టిక్ టాక్‌కి లైఫ్ అండ్ డెత్... ట్రంప్ డెడ్ లైన్
04-08-202004-08-2020 10:36:39 IST
2020-08-04T05:06:39.771Z04-08-2020 2020-08-04T05:06:21.168Z - - 19-04-2021

టిక్ టాక్ ఎంతోమంది యువతను స్టార్లను చేసింది. కోట్లాదిమంది ఈ టిక్ టాక్ బానిసలుగా మారారు. తాజాగా చైనా-భారత్ ఉద్రిక్తతలతో టిక్ టాక్, పబ్ జి లాంటి యాప్ లకు కష్టకాలం వచ్చింది. ఈ రెండింటిని భారత్ లో నిషేధించారు. తాజాగా అమెరికా టిక్ టాక్ పై కన్నేసింది. కీలకమయిన సమాచారం చోరీ జరుగుతోందంటున్నారు. దీంతో సోషల్ మీడియా యాప్ ‘టిక్‌టాక్’ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్ లైన్ ఇచ్చారు. టిక్ టాక్ ని అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి విక్రయించాలని, లేనట్లయితే ఆ యాప్‌ను తమ దేశంలో నిషేధిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను ఒక అమెరికన్ కంపెనీకి విక్రయించడానికి ఆరు వారాల గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఏదో ఒకటి తేల్చుకోవాలని లేదంటే నిషేధం తప్పదని స్పష్టం చేశారు. మైక్రోసాఫ్ట్ , లేదా మరో పెద్ద సంస్థ టిక్ టాక్ కొనుగోలుకు సిద్ధం వున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా చేసినా తనకు అభ్యంతరం లేదని సురక్షితమైన అమెరికన్ సంస్థ కావాలి అని ట్రంప్ అంటున్నారు. భద్రతతో తమకు ఎటువంటి సమస్య ఉండకూడదని తెలిపారు. అలాగే ఈ ఒప్పందం నుండి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటుందని చెప్పారు. టిక్ టాక్ కొనుగోలుకు సంబంధించి సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేస్తామని, సమాచార భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటామని మైక్రో సాఫ్ట్ తెలిపింది. దీంతో టిక్ టాక్ అమెరికా సంస్థ ఆధిపత్యంలోకి వెళ్లడం ఎంతో దూరంలో లేదన్నమాట. చైనాను ఆర్థికంగా నష్టపరిచేందుకు అనేక దేశాలు తమచేతిలోని ఆయుధాలను ఉపయోగిస్తున్నాయి. చైనాకు భారీ షాక్.. పబ్ జి సహా 47 యాప్స్ బ్యాన్? పాక్‌లో మొన్న పబ్ జీ గేమ్ బ్యాన్.. టిక్ టాక్‌కి వార్నింగ్

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా