newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

టిక్ టాక్‌పై భారత్ నిఘానేత్రం

04-01-202004-01-2020 16:14:14 IST
2020-01-04T10:44:14.822Z04-01-2020 2020-01-04T10:44:12.777Z - - 20-01-2020

టిక్ టాక్‌పై భారత్ నిఘానేత్రం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అతి కొద్దికాలంలోనే టిక్ టాక్ యాప్ కోట్లాదిమందికి చేరువ అయింది. వివిధ వివాదాలతో మధ్యలో కొంతకాలం నిషేధానికి గురైనా.. తర్వాత మళ్ళీ యథాస్థానానికి చేరుకుంది. తాజాగా టిక్ టాక్ కి సంబంధించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది.  ‘టిక్‌టాక్‌’ యాప్ కార్యకలాపాలపై ప్రపంచ దేశాలకన్నా భారత్‌ అధికారుల నిఘానే ఎక్కువగా కొనసాగుతోందని డేటా చెబుతోంది.

సామాజిక భద్రత, వినియోగదారుల వ్యక్తిగత గోప్యతను పరిగణనలోకి తీసుకుంటూ టిక్ టాక్ యాజమాన్యాన్ని భారత ప్రభుత్వం వివిధ సమాచారం అడుగుతుంది. వినియోగదారుల సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రపంచంలో 28 దేశాలు ‘టిక్‌టాక్‌’ యాజమాన్యాన్ని కోరగా, అందులో 36 శాతం వినతులు భారత అధికారుల నుంచే రావడం విశేషం. టిక్ టాక్ ని అడిగిన వినతుల్లో సింహభాగం 107 చట్టపరమైన, అత్యవసరమయినవి వున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా టిక్‌టాక్‌ యూజర్లలో 40 శాతం మంది భారతీయులే ఉండడం విశేషం. గత ఏడాది జనవరి 1వ తేదీ నుంచి జూన్‌ 30వ తేదీల మధ్య 28 దేశాల నుంచి తమకు యూజర్ల సమాచారం కావాలంటూ భారత్ అడిగింది.

ఇలా వివిధ దేశాల ప్రభుత్వాల నుంచి వచ్చే విజ్ఞప్తులను తాము తీవ్రంగానే పరిగణిస్తామని, యూజర్‌ కామెంట్లు వివిధ దేశాల స్థానిక చట్టాలను ఉల్లంఘించే విధంగా ఉంటే వాటిపై చర్యలు వుంటాయని టిక్ టాక్ మేనేజ్ మెంట్ తెలిపింది. టిక్ టాక్ వల్ల యువతకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని, వ్యక్తిగత వివరాలు పరిశీలిస్తామన్నారు. అయితే తక్కువమంది వినియోగదారుల సమాచారం మాత్రమే అధికారులకు అందించినట్లు  ‘టిక్‌టాక్‌’ యాజ్‌మాన్యం తెలిపింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle