టిక్ టాక్‌కి పోటీగా.. యూట్యూబ్ నయా ఫీచర్
27-06-202027-06-2020 09:13:38 IST
Updated On 27-06-2020 09:29:41 ISTUpdated On 27-06-20202020-06-27T03:43:38.296Z27-06-2020 2020-06-27T03:43:17.671Z - 2020-06-27T03:59:41.737Z - 27-06-2020

ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నెన్నో కొత్తరకాల యాప్ లు వస్తున్నాయి. తాజాగా చైనాకు వ్యతిరేకంగా భారతదేశంలో ప్రచారం సాగుతోంది. చైనా బ్యాన్, చైనా యాప్స్ తొలగింపు గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనం. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి చేరువయిన గూగుల్ మరో విభాగం యూట్యూబ్ వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు కొత్త ఫీచర్‌తో రానున్నట్టు ప్రకటించింది. పాపులర్ వీడియో ప్లాట్‌ఫామ్, చైనాకు చెందిన టిక్‌టాక్ మాదిరిగానే సరికొత్త ఫీచర్‌ను యూట్యూబ్ త్వరలోనే త్వరలో ప్రారంభం కానుంది. గూగుల్ యాజమాన్యంలోని వీడియో ప్లాట్‌ఫాం క్రొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండిండిలోనూ దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు యూట్యూబ్ తెలిపింది. అయితే ఇందులో 15 సెకన్ల వీడియో పోస్ట్ చేయడానికి మాత్రమే అనుమతి ఉంది. టిక్ టాక్ మాదిరిగా అన్ని రకాల ప్రత్యేకతలు ప్రస్తుతానికి ఇందులో అందుబాటులో లేవని తెలుస్తోంది. తమ వెబ్సైట్లో ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. పరీక్షల అనంతరం దీన్ని భారీగా ప్రారంభించనున్నారు. ఈ ఫీచర్ లో 15 సెకన్ల వరకు వీడియోలను పోస్ట్ చేయవచ్చు. ఒకేసారి ఎక్కువ వీడియోలను అప్లోడ్ చేయాలనుకుంటే, ఫోన్ గ్యాలరీ నుండి నేరుగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే టిక్‌టాక్ మాదిరిగా ఫిల్టర్లు, మ్యూజిక్ సపోర్ట్ లభిస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. టిక్‌టాక్ లేదా ఇతర ఆధునిక చిన్న వీడియో యాప్ లలో కూడా వీడియో కంటెంట్ లిమిట్ ఎక్కువ ఉండటంతోపాటు, ఏఆర్ ఎడిటింగ్ ఎఫెక్టులతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. యూట్యూబ్ దీన్ని మరింత మెరుగుపర్చాలని లేకుంటే వినియోగదారుల దీని గురించి ఆలోచించే అవకాశమే వుండదని అంటున్నారు. షార్ట్స్ పేరుతో టిక్‌టాక్ లాంటి యాప్‌ను యూట్యూబ్ త్వరలో తీసుకురానుందని వార్తలు వచ్చాయి. ఆ ఫీచర్ గురించే యూట్యూబ్ ఇప్పుడు ప్రకటన చేసింది. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ఫీచర్లను అనుకరించడం యూట్యూబ్‌కి కొత్తేం కాదు. గతంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, స్నాప్‌చాట్ తరహాలో స్టోరీస్ అప్డేట్ ఫీచర్ రీల్స్ ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం యూట్యూబ్ తీసుకురానున్న కొత్త ఫీచర్ గురించి ఆసక్తి కనబరుస్తున్నారు యూట్యూబ్ వినియోగదారులు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా