newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘టిక్‌ టాక్‌ యాప్‌’‌కు షాక్... కేంద్రం కీలక నిర్ణయం

16-04-201916-04-2019 16:19:35 IST
Updated On 16-04-2019 16:19:34 ISTUpdated On 16-04-20192019-04-16T10:49:35.781Z16-04-2019 2019-04-16T10:49:03.387Z - 2019-04-16T10:49:34.125Z - 16-04-2019

‘టిక్‌ టాక్‌ యాప్‌’‌కు షాక్... కేంద్రం కీలక నిర్ణయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా యువతను ఆకట్టుకుంటున్న టిక్ టాక్ యాప్ పట్ల కేంద్రం తీవ్రంగా స్పందించింది. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉన్న ఈ యాప్ యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ యాప్‌ అనతి కాలంలోనే ఎంతో ఆదరణ పొందింది. దీని వల్ల పిల్లల్లో పెడధోరణులు పెరిగిపోతున్నాయని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. టిక్‌ టాక్‌ యాప్‌ను ప్లేస్టోర్ల నుంచి తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్‌, యాపిల్‌ సంస్థలను ఆదేశించింది.

చైనాకు చెందిన ఈ వీడియో షేరింగ్‌ యాప్‌పై సర్వత్రా అభ్యంతరం వ్యక్తం అవుతోంది.  దీంతో దీన్ని నిషేధించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మదురైకి చెందిన సీనియర్‌ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తు కుమార్‌ మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రాన్ని ఇంతకుముందే ఆదేశించింది. 

ఈ యాప్‌ ద్వారా రూపొందించిన వీడియోలను ప్రసారం చేయకూడదని మీడియాకు సూచించింది. చిన్న పిల్లలు సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఏప్రిల్‌ 16లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు మేరకు చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం తాజా ఆదేశాలను జారీ చేసింది. ఇదిలా ఉంటే.. మద్రాసు హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని టిక్‌ టాక్‌ సంస్థ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ తరుపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. భావ ప్రకటన స్వేచ్చను ఉల్లంఘిస్తున్నాయంటూ సింఘ్వీ పిటిషనర్ తరపున వాదించారు.

దీనిపై విచారణ చేపట్టిన కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్‌ 22న జరుపుతామని తెలిపింది. థర్డ్‌ పార్టీ అప్‌లోడ్‌ చేసే వీడియోలకు తమల్ని బాధ్యులను చేయడం ఎంతవరకూ సమంజసమని టిక్‌టాక్‌ ప్రశ్నించింది.కొద్ది రోజుల ముందే టిక్ టాక్‌లో అభ్యంతరకర వీడియోలు ఉన్నాయంటూ ఫిర్యాదు అందడంతో 6 మిలియన్ వీడియోలను తొలగించింది టిక్ టాక్. ఇందులో ఖాతాదార్లుగా 90 మిలియన్ యూజర్లు ఉన్నారని సమాచారం. ఇప్పటికే యూఎస్, యూకే, హాంకాంగ్, ఇండోనేషియా దేశాల్లో ఈ యాప్‌లపై పూర్తిగా నిషేధం ఉంది. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle