newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టిక్‌టాక్‌ ఫోన్‌ వచ్చేసింది... ఇక వీడియోలే వీడియోలు

05-11-201905-11-2019 09:37:08 IST
Updated On 05-11-2019 15:50:37 ISTUpdated On 05-11-20192019-11-05T04:07:08.764Z05-11-2019 2019-11-05T04:06:59.602Z - 2019-11-05T10:20:37.453Z - 05-11-2019

టిక్‌టాక్‌ ఫోన్‌ వచ్చేసింది... ఇక వీడియోలే వీడియోలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టిక్‌టాక్‌ నుంచి ఓ స్మార్ట్‌ ఫోన్‌ వస్తోందని చాలా రోజుల క్రితమే వార్తలొచ్చాయి. ఇది నిజమేనా... లేక ప్రచార హంగా అని చాలామంది అనుకున్నా... చైనా కంపెనీ కదా తీసుకొచ్చేస్తారు లే అని అనుకున్నారు. ఎట్టకేలకు టిక్‌టాక్‌ అభిమానుల కోసం ఆ ఫోన్‌ వచ్చేసింది. టిక్‌ టాక్‌ మాతృ సంస్థ ‘బైట్‌ డ్యాన్స్‌’ తన మొట్టమొదటి స్మార్ట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేసింది. ‘స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3’ (నట్‌ ప్రో 3) పేరుతో ఈ మొబైల్‌ చైనా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 

నట్‌ ప్రో3లో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. మెరుగైన సెల్ఫీల కోసం సెల్ఫీ లైటింగ్‌ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 855 ప్లస్‌ ప్రాసెసర్‌ని ఉపయోగించారు. స్మార్టిసాన్‌ సొంత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 7 ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది. అయితే ఇది ఏ వెర్షన్‌ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌తో పనిచేస్తుందనేది సంస్థ వెల్లడించలేదు. 6.39 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఈ మొబైల్‌ వస్తోంది. 

ఈ ఫోన్‌లో ముందు వైపు 4 ఇన్‌ 1 పిక్సెల్‌ బిన్నింగ్‌ సాంకేతికతతో 20 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు సోనీ ఐఎమ్‌ఎక్స్‌ 586 సెన్సర్‌తో 48 మెగాపిక్సెల్‌ కెమెరా తీసుకొస్తున్నారు. దీంతోపాటు వైడ్‌ యాంగిల్ సెన్సర్‌తో 13 ఎంపీ కెమెరా ఉంటుంది. ఆప్టికల్‌ జూమ్‌ కోసం 2 ఎక్స్ ఆప్టికల్‌ జూమ్‌ కెమెరా ఉంటుంది. వీటితోపాటు టెలీ ఫొటో లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది. వీటికి 5 ఎంపీ మాక్రో కెమెరా అదనం. దీంతో దగ్గరల్లోని వస్తువులను మెరుగ్గా ఫొటో తీయొచ్చు. ఈ మొబైల్‌లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది. 

8 జీబీర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉన్న మొబైల్‌ ధర 2,899 యువాన్లు (సుమారుగా రూ.29,000). 8 జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌ ధర 3,199 యువాన్లు (సుమారుగా రూ.32,000). 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌ ధర 3,599 యువాన్లు (సుమారుగా రూ.36,000). ప్రస్తుతానికి ఈ ఫోన్‌ చైనాలో మాత్రమే అమ్మకానికి ఉంది. ఇతర దేశాల్లో ఎప్పుడు అమ్మకానికి రానుందనే దానిపై స్పష్టత లేదు.

Image result for tiktok mobile launch in china

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle