టాటా స్కై బంపరాఫర్.. 2 నెలలు ఫ్రీ సర్వీస్
28-04-202028-04-2020 11:23:57 IST
Updated On 28-04-2020 11:42:26 ISTUpdated On 28-04-20202020-04-28T05:53:57.509Z28-04-2020 2020-04-28T05:36:53.872Z - 2020-04-28T06:12:26.302Z - 28-04-2020

లాక్ డౌన్ నేపథ్యంలో వివిధ డీటీహెచ్ ఆపరేటర్లు వివిధ రకాల సదుపాయాలను ఆఫర్లను వినియోగదారులకు అందిస్తున్నాయి. తాజాగా డిటిహెచ్ ఆపరేటర్లలో ఒకటైన టాటా స్కై 'టాటా స్కై క్యాష్‌బ్యాక్' ఆఫర్ రూపంలో సాధారణ దీర్ఘకాలిక రీఛార్జ్ ఎంపికను ముందు నుంచి అందిస్తోంది. వినియోగదారులకు మరింతగా చేరువ అయ్యేందుకు మరొక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా చందాదారులు 12 నెలల లేదా ఒక సంవత్సర కాలానికి ఒకే సారి రీఛార్జ్ చేసుకుంటే కనుక వారికి అదనంగా రెండు నెలల సేవలను ఉచితంగా అందిస్తోంది. అయితే ఇక్కడ కొన్ని షరతులను విధించింది. ఈ ఆఫర్ అందుకోవాలంటే ఖచ్చితంగా సిటీబ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉపయోగించి టాటా స్కై అకౌంటును రీఛార్జ్ చేయాలి. అలాంటి చందాదారులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తుంది. గతంలో టాటా స్కై క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండగా ఈ కొత్త ఆఫర్ మాత్రం సిటీబ్యాంక్ కార్డు వినియోగదారులకు మాత్రమే పరిమితం చేయడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టాటా స్కై మొబైల్ యాప్ మరియు వెబ్సైట్ రెండింటి ద్వారా ఈ ఆఫర్ అందుకోవచ్చని టాటా స్కై చెబుతోంది. క్యాష్‌బ్యాక్ మొత్తం రీఛార్జ్ చేసిన తేదీ నుండి ఏడు రోజుల్లో జమ అవుతుందని, గత ఏడాది నుంచి ఇది అందుబాటులో వుందని చెబుతోంది. ఇది ఇప్పటికే వినియోగంలో వున్న ఖాతాదారులకు అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా ఒక నెల అదనపు సేవలను పొందటానికి వీలు కల్పిస్తుంది. ప్రస్తుత టాటా స్కై వినియోగదారులు టాటా స్కై యొక్క వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లలో సిటీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి వారి నెలవారీ రీఛార్జ్ విలువకు 12 రెట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో వారి అకౌంటును రీఛార్జ్ చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. టాటా స్కై యొక్క ఒక నెల క్యాష్‌బ్యాక్ 48 గంటల్లో జమ అవుతుంది. అలాగే మరో నెల క్యాష్‌బ్యాక్ ఏడు రోజుల్లో జమ అవుతుంది. ఈ ఆఫర్ జూన్ 30, 2020 వరకు మాత్రమే లభిస్తుంది.2 నెలల చెల్లుబాటు కాలానికి రీఛార్జ్ చేయడం నచ్చని వారికి తక్కువ మొత్తంలో నెల వారి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు 200 రూపాయల నుంచి చాలా ప్లాన్ లు అందుబాటులో ఉన్నాయి. 12 నెలల కాలానికి రీఛార్జి చేసుకోవడం ద్వారా 2 నెలలు అదనంగా సేవలు అందుకోవడం మంచిదేకదా. లాక్ డౌన్ టైంలో టాటా స్కై పిల్లల కోసం వివిద గేమింగ్ ఛానెల్స్, కార్టూన్ , యోగా ఛానెల్స్ ఉచితంగా అందిస్తోంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా