newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జొమోటో ఔదార్యం.. ఉద్యోగినులకు పది రోజుల ‘పిరియడ్‌ లీవ్‌’

11-08-202011-08-2020 11:44:30 IST
2020-08-11T06:14:30.235Z11-08-2020 2020-08-11T06:14:22.566Z - - 17-04-2021

జొమోటో ఔదార్యం.. ఉద్యోగినులకు పది రోజుల ‘పిరియడ్‌ లీవ్‌’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మన దేశంలో రుతుస్రావానికి సంబంధించిన ఎన్నో అపోహలు, విశ్వాసాలు ఉన్నాయి. రుతుస్రావంలో ఉన్న స్త్రీల మానసిక, శారీరక స్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం పూర్తిగా నేటి వరకు కుటుంబం, సమాజం చేయనేలేదు. రుతుస్రావ యోగ్యత ఉన్న స్త్రీలను శబరిమల ఆలయ ప్రవేశానికి అర్హులుగా చేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై చర్చ, అభ్యంతరం కొనసాగుతూనే ఉంది. 

మరోవైపున స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్లకుగాని స్త్రీలకు శానిటరీ నేప్‌కిన్స్‌ సమకూర్చే ప్రచారం, ప్రయత్నం మొదలుకాలేదు. వీటన్నింటి నేపథ్యంలో ప్రఖ్యాత ఫుడ్‌ డెలివరీ సంస్థ ‘జొమాటో’ తీసుకున్న నిర్ణయం స్త్రీల రుతుస్రావ సమయాలను వొత్తిడి రహితం చేసే ఒక మంచి ఆలోచనగా భావించవచ్చు. తమ సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగులు సంవత్సరానికి పది రోజులు పీరియడ్ లీవ్ తీసుకోవచ్చునని పేర్కొంటూ ఉద్యోగులను ఉద్దేశించి కంపెనీ సీఈఓ దీపేందర్ గోయల్ రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనానికి దారి తీసింది.

‘ప్రియమైన మహిళా ఉద్యోగులారా.. మీరు చాలాసార్లు సెలవు కోసం మెసేజ్‌లు పెట్టి ఉంటారు. ఆ మెసేజ్‌లలో నలతగా ఉందనో, మరేదో నొప్పి అనో రాసి ఉంటారు. కాని నేను పిరియడ్స్‌లో ఉన్నాను... నాకు రెస్ట్‌ కావాలి అని నామోషీ లేకుండా రాశారా ఇక మీదట రాయండి. పిరియడ్స్‌ సమయంలో కొందరిలో వచ్చే కడుపు నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందో నాకు తెలుసు. 

అందుకే ఇక మీదట మా సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగులు సంవత్సరానికి పది రోజులు పిరియడ్‌ లీవ్‌ తీసుకోవచ్చు’ అని ప్రఖ్యాత ఫుడ్‌ డెలివరీ సంస్థ ‘జొమాటో’ సి.ఈ.ఓ దీపెందర్‌ గోయల్‌ తన ఉద్యోగులను ఉద్దేశించి తాజాగా లేఖ రాశారు. ఈ సౌలభ్యం వల్ల జొమాటోలో పని చేసే మహిళా ఉద్యోగులకు రెగ్యులర్‌ సెలవులతో పాటు పది రోజుల అదనపు సెలవు దొరికినట్టయ్యింది.

అదేసమయంలో ప్రకృతి సమస్యల కారణంగా మహిళలు పీరియడ్ లీవ్ తీసుకున్నప్పుడు సంస్థలోని మహిళా ఉద్యోగుల పరిస్థితిని పురుష ఉద్యోగులు అర్థం చేసుకుని సహకరించాలంటూ జొమోటో సీఈవో పేర్కొన్నారు. స్త్రీల జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైన పీరియడ్స్ పట్ల సంస్కారం అలవర్చుకోవడానికే తమ కంపెనీలో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని దీపేందర్ చెప్పారు.

‘డియర్‌ మగ ఉద్యోగులూ... మన సంస్థలో పని చేసే మహిళా ఉద్యోగులు పిరియడ్‌ లీవ్‌ పెట్టినప్పుడు వారి పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించండి. వారు తమకు విశ్రాంతి కావాలి అని చెప్పినప్పుడు మనం వారిని నమ్మాలి...

నేను మహిళా ఉద్యోగులకు ఈ సౌలభ్యం కలిపిస్తున్నది బహిష్టు గురించి మనకు ముందు నుంచి ఉన్న పాతకాలపు భావనలు, నిషిద్ధ అభిప్రాయాలు సమసిపోవడానికే. స్త్రీల జీవితంలో ఒక భాగమైన విషయం పట్ల సంస్కారం అలవర్చుకోవడానికే. స్త్రీల సమస్యలు ఎలాంటివో స్త్రీలకు మాత్రమే తెలుస్తాయి. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడే మనం సమష్టిగా సమర్థంగా పని చేయగలం’ అని కూడా దీపెందర్‌ గోయల్‌ ఆ లేఖలో రాశారు.

కాగా జొమాటో భారతదేశంలోని గుర్‌గావ్‌లో 2008లో మొదలయ్యి ఇవాళ 24 దేశాలలో సేవలందిస్తోంది. ఆ సంస్థలో 5 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 

ప్రపంచంలోనే మహిళలకు బహిష్టు సమయంలో లీవులు ఇస్తున్న ఏకైక దేశ ఐర్లండ్ మాత్రమే. ఇప్పుడు ప్రభుత్వ పరిధిని దాటి ఒక ప్రైవేట్ ఫుడ్ డెలివరీ సంస్థ ఈ సున్నితమైన విషయంలో కాస్త ఔదార్యంతో వ్యవహరించడం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలన్నింటికీ కనువిప్పు కావాలి.

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle