newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జూమ్ యాప్.. గూగుల్ మీట్.. ఫేస్ బుక్ మెసెంజర్

28-04-202028-04-2020 11:02:55 IST
Updated On 28-04-2020 11:06:47 ISTUpdated On 28-04-20202020-04-28T05:32:55.710Z28-04-2020 2020-04-28T05:32:36.142Z - 2020-04-28T05:36:47.598Z - 28-04-2020

జూమ్ యాప్.. గూగుల్ మీట్.. ఫేస్ బుక్ మెసెంజర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెక్నాలజీ బాగా విస్తరిస్తున్న రోజులివి. అందులోనూ గత కొద్దికాలంగా మానవాళికి కరోనా వైరస్ శాపంగా మారింది. ఆఫీసులకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో ఇప్పుడు ఉద్యోగులంతా ఇంటికే పరిమితం అయ్యారు. వర్క్ ఫ్రం హోంలో వున్న ఉద్యోగులను కలుసుకోవడం, వారితో ముఖాముఖి ముచ్చటించడం చాలా కష్టం. అందుకే వివిధ రకాల ఆదేశాలు ఇవ్వడానికి వీడియో కాన్ఫరెన్స్ లు విస్తృతంగా సాగుతున్నాయి.  వివిధ ప్రభుత్వ శాఖలు, పోలీసులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా ఆదేశాలు జారీచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లకు బాగా పాపులారిటీ పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైతం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గ్రామాధికారులతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించిన సంగతి తెలిసిందే.

వీడియో కాన్ఫరెన్సులలో ఇప్పటికే టాప్ ప్లేసులో వున్న జూమ్‌ యాప్‌ అంతగా సేఫ్టీకాదంటున్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో దానికి ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ మొదలైంది. గూగుల్ ఈ అవకాశాన్నివినియోగం చేసుకుంటోంది. తన హ్యాంగ్‌ అవుట్‌ మీట్‌ను గూగుల్‌ మీట్‌గా మార్చి తీసుకొచ్చింది. ఇందులో కొత్త సదుపాయాలను జోడించడం విశేషం. దీని ద్వారా క్వాలిటీ అయిన వీడియో అందుబాటులో వుంటుంది. 

గూగుల్‌ మీట్‌లో ఇప్పటివరకు ఒక స్క్రీన్‌లో కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే కనిపించేవారు. ఇప్పుడు ఆ సంఖ్యను 16కి పెంచారు. వీడియోలో మాట్లాడేటప్పుడు మీరున్న ప్రదేశంలో లైటింగ్‌ కండిషన్‌ సరిగా లేకున్నా ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ  దానిని సరిచేస్తుంది. ప్రస్తుతం మొబైల్‌ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అలాగే, ఈ మీటింగ్స్‌లో వీడియో, ఆడియో కంటెంట్‌ను ఇతరులకు షేర్‌ చేసుకునేందుకు వీలుగా ‘ప్రెజెంట్‌ ఏ క్రోమ్‌ ట్యాబ్‌’ సదుపాయం తీసుకొచ్చారు. జూమ్‌లో మొత్తం బ్రౌజర్‌ షేర్‌ అవుతుంది. దీంతో పాటు నాయిస్‌ కాన్సిలేషన్‌ సదుపాయం ఉంది.

జనం ఇప్పుడు వినియోగిస్తున్న జూమ్ యాప్ కంటే గూగుల్ మీట్ ప్రయోజనకరంగా అంటున్నారు. అలాగే ఫేస్ బుక్ కూడా  వీడియో కాలింగ్ ను మరింత సులభతరం చేయడం కోసం కొత్తగా మెసెంజర్ రూమ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మెసెంజర్ రూమ్స్ ద్వారా వినియోగదారులు 50 మందితో వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ మెసెంజర్ రూమ్స్ ను ఎవరైనా క్రియేట్ చేయవచ్చు. ఫేస్ బుక్ ఖాతా లేకపోయినా వారు దీనిని వినియోగించుకునే అవకాశం ఉంది. వినియోగదారుల. భద్రత, గోప్యత కోసం ఇందులో ఎవరెవరు చేరుతున్నారో రూమ్ క్రియేట్ చేసిన వ్యక్తి చూడవచ్చు. ఇందులో నుంచి ఎవరినైనా సరే తీసేసే అధికారం రూంను క్రియేట్ చేసిన అడ్మిన్ కి ఉంటుంది. ఈ మెసెంజర్ రూమ్స్ ఈ వారంలో కొన్ని దేశాల్లో అందుబాటులోకి వస్తాయి. తర్వాత దశలవారీగా అన్ని దేశాల్లో వీటిని లాంచ్ చేస్తామని ఫేస్ బుక్ వెల్లడించింది. 

 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle