newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జూమ్ గుత్తాధిపత్యానికి జియో మీట్ చెక్ పెడుతుందా?

10-07-202010-07-2020 14:25:08 IST
Updated On 10-07-2020 17:05:19 ISTUpdated On 10-07-20202020-07-10T08:55:08.835Z10-07-2020 2020-07-10T08:48:54.474Z - 2020-07-10T11:35:19.174Z - 10-07-2020

జూమ్ గుత్తాధిపత్యానికి జియో మీట్ చెక్ పెడుతుందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ వల్ల అన్ని వ్యాపారాలు మూలనపడ్డాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ భయం వల్ల వర్క్ ఫ్రం హోం సంస్కృతి బాగా పెరిగింది. ఉద్యోగుల మధ్య భౌతిక దూరం అవసరం అయింది. స్కూల్లో విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెప్పడానికి, ఆఫీసుల్లో ఉద్యోగులతో మీటింగులు పెట్టుకోవడానికి ఎవరూ సాహసించడం లేదు. భౌతికదూరం పాటించాలంటే తరగతి గదులు, బోర్డు రూములు సరిపోవు. అందుకే, అందరూ ఆన్‌లైన్‌ బాట పడుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలన్నీ సాధ్యమైనంత మేరకు వర్క్‌ఫ్రం హోం ద్వారా లాగించేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ సమావేశాలకు డిమాండ్‌ పెరిగింది. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్‌, గూగూల్‌ అప్పటికే వీడియో కాన్ఫరెన్సింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో ఆరితేరి ఉన్నాయి. ఈమధ్య అందుబాటులోకి వచ్చిన ‘జూమ్‌’ యాప్‌ కరోనా కాలంలో అందరికీ సౌలభ్యాలను అందించింది.

అయితే జూమ్ యాప్ గుత్తాధిపత్యాన్ని తగ్గించేందుకు రంగంలోకి దిగింది జియో మీట్. గత మార్చిలో జూమ్ యాప్ ను వారంలోనే 6.2 కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కాలేజీలు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఎవరినోట విన్నా ‘జూమ్‌’ పేరే. స్టాక్‌ మార్కెట్లో షేర్లు జూమ్‌ అని దూసుకుపోయాయి. వర్క్‌ఫ్రం హోం శాశ్వతం అవుతుందన్న నమ్మకాలతో వీడియో కాన్ఫరెన్సింగ్‌ వ్యాపారం భవిష్యత్తు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. జూమ్ యాప్ చైనా కంపెనీ అని, దానిపై నిషేధం విధించాలని ప్రత్యర్ధులకు వార్ మొదలెట్టారు. 

మొదట చైనా కంపెనీ అన్నారు. కానీ జూమ్ కాలిఫోర్నియాలో రిజిస్టర్‌ అయిన అమెరికన్‌ కంపెనీ. వ్యవస్థాపకుడు ప్రవాస చైనీయుడు కావడంతో అందులో ఎక్కువ మంది డెవలపర్లు చైనా వాళ్లే ఉన్నారు. పైగా ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో లొసుగులు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో  చైనాలో ఉన్న 700 మంది డెవలపర్ల సాయంతో  వినియోగదారుల సమాచారాన్ని చైనా సర్కారు తస్కరించే వీలుందని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గత ఏప్రిల్లో భారత ప్రభుత్వం జూమ్‌ ప్రతినిధులను వివరణ కోరింది. గోప్యత, డేటా స్టోరేజీ విషయాలను ప్రస్తావించింది. 

తమది అమెరికన్‌ కంపెనీ అని, భారత్‌కు సంబంధించిన డేటా భారత్‌లోనే స్టోర్‌ అవుతోందని ప్రపంచంలోని 17 డేటా సెంటర్లలో హైదరాబాద్‌, ముంబయిల్లో రెండు ఉన్నాయని వివరించింది. తమ డేటాను భారత ప్రభుత్వానికి యాక్సెస్‌ ఇవ్వడానికి అంగీకరించింది. చైనాతో ఘర్షణ అనంతరం భారత్ 59 చైనా యాప్‌లను నిషేధించినపుడు జూమ్‌ జోలికి పోకపోవడంతో దానిపై ఉన్న చైనా ముద్రను తొలగించుకొనే అవకాశం కంపెనీకి లభించింది.

అయితే కొందరు జూమ్ పై చైనా ముద్ర వేశారు. అయితే ఇదే సమయాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని భావించింది ఇంటర్నెట్‌ సేవల దిగ్గజం జియో. దాదాపు 30 వేల కోట్ల ఆదాయం అవకాశం ఉన్న వీడియో కాన్ఫరెన్సింగ్‌ వ్యాపారం మీద దృష్టి సారించింది. హడావిడిగా ‘జియో మీట్‌’ యాప్‌ను రూపొందించింది. ఈమధ్యే భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. మిగతా వీడియోకాన్ఫరెన్సింగ్‌ యాప్‌లన్నీ పెయిడ్‌ సర్వీసులు విడిగా ఇస్తుంటే, జియో మీట్‌ అన్ని ఫీచర్లను పూర్తిగా ఉచితంగా ఇవ్వడంతో బాగా పోటీ పెరిగింది. 

అయితే, ‘జియో మీట్‌’ యాప్‌ యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ అచ్చం జూమ్‌ లాగే ఉందని ట్విటర్లో విమర్శలు వెల్లువెత్తాయి. తమను కాపీ చేశారని జూమ్ యాప్ ప్రతినిధులు న్యాయపోరాటానికి దిగాలని భావిస్తున్నారు. జియోమీట్ పై దావా వేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యాపారం బాగా పెరగడంతో వ్యాపారం విలువ పెరుగుతోంది. రానున్న రోజుల్లో జియో మీట్ వినియోగదారుల సంఖ్య పెరగనుందని టెక్ నిపుణులు అంటున్నారు.

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle