జియో సెట్ టాప్ బాక్స్‌లో ఓటీటీ యాప్స్.. ఎలా?
05-02-202005-02-2020 15:33:33 IST
2020-02-05T10:03:33.264Z05-02-2020 2020-02-05T10:03:30.965Z - - 17-04-2021

దేశవ్యాప్తంగా జియో హవా కొనసాగుతోంది. దీనికి తోడు జియో సంస్థ బ్రాడ్ బ్యాండ్ సేవలు కూడా ప్రారంభించారు. ఓటీటీ ద్వారా వివిధ రకాల యాప్స్ పొందడం చాలా ఈజీ. జియో సెట్-టాప్ బాక్స్ ద్వారా డీటీహెచ్ మరియు ఓటీటీ సేవలను ఒకే దానిమీద అందిస్తోంది. ఇతర సెట్-టాప్ బాక్స్‌ల మాదిరిగానే ఈ సెట్-టాప్ బాక్స్ కూడా ఆండ్రాయిడ్ టీవీ ద్వారా ఆపరేట్ చేయబడుతుందని చెబుతున్నారు. రిలయన్స్ జియో సెట్-టాప్ బాక్స్ ఫ్రీ కాలింగ్, వీడియో కాలింగ్ వంటి మరిన్ని ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. జియో యొక్క ఈ సెట్-టాప్ బాక్స్ ముందుగానే రిలయన్స్ జియో యాప్ లతో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు నెట్‌ఫ్లిక్స్ వంటి కొన్ని ప్రసిద్ధ యాప్ లను సెట్-టాప్ బాక్స్‌లో చందాదారులు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓటీటీ యాప్స్ ఇన్ స్టలేషన్ ఎలా? జియో సెట్ టాప్ బాక్స్ లో ఓటీటీ సేవలను వినియోగించుకోవచ్చు. అయితే ఆయా యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. జియో టీవీ ప్లస్, జియోసినిమా, జియోసావన్ వంటి మరిన్ని యాప్ లను చూడవచ్చు. సెట్-టాప్ బాక్స్‌లో గల బ్రౌజర్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయాలి. దీనిని ఓపెన్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేయదలిచిన సంబంధిత అప్లికేషన్ యొక్క APK ఫైల్ కోసం సెర్చ్ చేయాలి. జియో పేజీలలోని యాప్ లను సెర్చ్ చేయడానికి మీరు రిమోట్లోని వాయిస్ సెర్చ్ బటన్‌ను నొక్కి సెర్చ్ కీవర్డ్‌ని ఉపయోగించాలి. మీకు అమెజాన్ ప్రైమ్ వీడియోలు కావాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియో అని టైప్ చేయాలి. అందుకోసం అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం అందుబాటులో వున్న APK ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోగలిగే వెబ్సైట్ల జాబితా అందచేస్తుంది. అనంతరం APK ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. APK ఫైల్‌ను డౌన్లోడ్ చేసిన తరువాత సెట్-టాప్ బాక్స్ యొక్క సెట్టింగుల మెనూ దగ్గరకు వెళ్లి నావిగేషన్ నొక్కాలి. మీ సెట్ టాప్ బాక్స్‌లో ఇన్స్టాల్ చేసిన అన్ని యాప్ ల జాబితాను చూడవచ్చు. ఈ జాబితా నుండి యాప్ ఇన్స్టాలర్ అనే యాప్ ను ఓపెన్ చేయాలి. తర్వాత డౌన్లోడ్ చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో APK ని ఎంచుకోవాలి. అనంతరం ఇన్స్టాల్ బటన్ నొక్కాలి. దీని తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్ మీ జియో సెట్-టాప్ బాక్స్‌లో ఇన్స్టాల్ అవుతుంది. అదే విధంగా మిగతా యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసిన తరువాత మీరు లాగిన్ కావచ్చు మరియు ఆయా యాప్ లలో మీరు చూడాలనుకుంటున్న షోలను చూడవచ్చు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా