newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?

25-05-202025-05-2020 15:28:45 IST
Updated On 25-05-2020 15:46:21 ISTUpdated On 25-05-20202020-05-25T09:58:45.156Z25-05-2020 2020-05-25T09:57:51.387Z - 2020-05-25T10:16:21.489Z - 25-05-2020

జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెలికాం రంగంలో సంచలనం కలిగించిన జియో.. ఇప్పుడు మరోరంగంలోకి ప్రవేశించింది. ఈ కామర్స్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. రిలయన్స్ రిటైల్ కు చెందిన ఆన్‌లైన్ వెంచర్ జియో మార్ట్ ఆన్‌లైన్ గ్రోసరీ సేవలను ప్రారంభించింది. గత నెల  పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ సేవలను ఇపుడు జియోమార్ట్ మరింత విస్తరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.

ఆన్ లైన్ గ్రాసరీ సేవల్లోకి  మరింత వేగంగా  దూసుకొస్తోంది. దేశవ్యాప్తంగా 200కి పైగా పట్టణాల్లో కిరాణా సామాగ్రిని పంపిణీ చేయనుంది. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో వినియోగదారులకు అవసరమయిన వివిధ వస్తువులు సరఫరా చేయనుంది. రాజస్థాన్‌లోని నోఖా, తెలంగాణలోని బోధన్, తమిళనాడులోని నాగర్‌కోయిల్, ఆంధ్రాలోని తాడేపల్లిగూడెం, రాయగఢ్ (ఒడిశా), బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో కంపెనీ సేవలను ప్రారంభించనుంది.

దీంతో ఈ  సెగ్మెంట్ లో ఉన్న ప్ర‌ముఖ ఆన్ లైన్ డెలివ‌రీ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్టుల‌కు  గట్టి పోటీ ఇవ్వడంఖాయం అంటున్నారు. ముంబై, థానే, కళ్యాణ్ ప్రాంతాలతో పైలట్ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే ప్రముఖ పట్టణాలు. నగరాల్లో తన సేవలను విస్తరిస్తున్నట్టు  ప్రకటించింది జియోమార్ట్.

కొత్తగా ప్రారంభించిన ఇ-కామర్స్ పోర్టల్, జియోమార్ట్.కామ్  ద్వారా కిరాణా, పండ్లు, కూరగాయలు లాంటి ఇతర రోజువారీ కొనుగోళ్లకు వినియోగదారులు లాగిన్ అవ్వవచ్చు. అయితే ప్ర‌స్తుతానికి త‌న వెబ్ సైట్ ద్వారా మాత్ర‌మే క‌స్ట‌మ‌ర్ల ఆర్డ‌ర్స్ తీసుకుంటుండ‌గా, త్వ‌ర‌లో  జియోమార్ట్ యాప్  లాంచ్ చేయనుంది. ఇవి లాంచ్ అయితే మిగతా సూపర్ మార్కెట్లు, ఆన్ లైన్ డెలివరీ సంస్థలకు గడ్డుకాలం రావచ్చంటున్నారు, ఆన్ లైన్లో మంచి ఆఫర్లతో వినియోగదారులకు తన వైపు తిప్పుకోనుంది జియో మార్ట్. 

 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle