newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జియో, బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్

01-04-202001-04-2020 16:49:07 IST
2020-04-01T11:19:07.498Z01-04-2020 2020-04-01T11:19:03.374Z - - 12-04-2021

జియో, బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోట్లాదిమంది వినియోగదారులున్న జియో సంస్థ లాక్ డౌన్ వేళ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ ఇప్పటికే పలు టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు ఊరట కలిగించేలా పలు చర్యలు తీసుకున్నాయి. తాజాగా రిలయన్స్‌ జియో కూడా ఉపశమన చర్యలు చేపట్టింది. జియో ఫోన్‌ వినియోగదారులు ఏప్రిల్‌ 17 వరకు 100 నిమిషాల కాల్స్‌, 100 మెసేజ్‌లను ఉచితంగా అందివ్వనున్నట్టు ప్రకటించింది.

ఈ 100 నిమిషాలను దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కాల్స్‌ చేసుకునేందుకు వినియోగించుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.  అలాగే జియో ఫోన్‌ వినియోగదారుల ప్రీపైయిడ్‌ వ్యాలిటిడీ పూరైనప్పటికీ.. వారికి ఏప్రిల్‌ 17 వరకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సేవలు అందుతాయి. ఇప్పటికే గడువు ముగిసిన వినియోగదారులు హడావిడిగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు నెట్ అందుబాటులో లేకపోవడం, జియో స్టోర్లు తెరవకపోవడంతో  ఆఫ్‌లైన్‌ ద్వారా రీచార్జ్‌ చేసుకునే జియో వినియోగదారులు ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది జియో.

అలాగే డెబిట్‌ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా జియో వినియోగదారులు సులువుగా రీచార్జ్‌ చేసుకోవచ్చు. యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాదారులు ఎస్‌ఎంఎస్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా రీచార్జ్‌ చేసుకునే సదుపాయం కల్పించింది.  కరోనావైరస్‌ కట్టడిలో భాగంగా గత నెల 22 తర్వాతనుంచి లాక్‌డౌన్‌ కారణంగా ప్రీపెయిడ్‌ యూజర్లు ఇబ్బందిపడకుండా తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ఆదేశాలిచ్చింది. టెలికాం సర్వీసులకు అంతరాయం కలగకుండా వ్యాలిడిటీని పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించమని సూచించింది. దీంతో జియో ఈ చర్యలు తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ కూడా ఇలాంటి చర్యలే తీసుకుంది. గడువు ముగిసిన, త్వరలో ముగియనున్న ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ నెల 20వ తేదీ వరకూ ఇన్ కమింగ్ సేవలు, 10 రూపాయల టాక్ టైం అందిస్తోంది. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle