జియో ఫోన్ యూజర్స్‌కి ‘డబుల్ ధమాకా’
24-01-201924-01-2019 19:02:18 IST
2019-01-24T13:32:18.332Z24-01-2019 2019-01-24T13:32:15.613Z - - 14-04-2021

రావడం రావడంతోనే భారీ ఆఫర్లతో టెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టించిన రియలన్స్ జియో... ఆ తర్వాత కూడా అద్భుతమైన ఆఫర్లతో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇతర టెలికాం సంస్థలు తనకు ధీటుగానే వరుస ఆఫర్లు ఇస్తుండడంతో... జియో మరింతగా రెచ్చిపోతుంది. తక్కువ ధరలకే వినియోగదార్లకు భారీ ఆఫర్స్ తీసుకొస్తోంది. తాజాగా జియో ఫోన్ కస్టమర్ల కోసం రెండు సరికొత్త ఆఫర్స్‌ని తీసుకొచ్చింది. రూ.594, రూ.297 అనే రెండు కొత్త ప్లాన్లను మంచి ఆప్షన్స్‌తో లాంచ్ చేసింది. రూ.594 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే... యూజర్లు 168 రోజులపాటు అపరిమిత వాయిస్ కాల్స్, నెలకు 300 ఎస్ఎంఎస్లు, రోజుకి 0.5 జీబీ డేటాను పొందవచ్చు. వీటితో పాటు జియో సూట్ యాప్స్‌ను కూడా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక రూ.297 ప్లాన్‌ను రీఛార్స్ చేయించుకుంటే... 3 నెలలపాటు అపరిమిత వాయిస్ కాల్స్, నెలకు 300 ఎస్ఎంఎస్లు, రోజుకి 0.5 జీబీ డేటాను యూజర్స్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లోనూ జియో సూట్ యాప్స్‌ను ఫ్రీగా పొందవచ్చు. మరోవైపు... గిగా ఫైబర్ సేవల్ని ఈ మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై నగరాల్లో దీనిపై టెస్టింగ్స్ నిర్వహిస్తున్నారు. ఆ నగరాల్లో దీని సేవల్ని వాడుతున్న యూజర్లు మంచి రివ్యూలే ఇవ్వడంతో... మార్చి నుంచి దేశవ్యాప్తంగా గిగా ఫైబర్ సేవల్ని తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. ఈ జియో గిగా ఫైబర్ రూటర్ ద్వారా ఒకేసారి మల్టిపుల్ డివైస్ల మీద 1జిబిపిఎస్ స్పీడుతో ఇంటర్నెట్ సర్వీసులను అందుకోవచ్చు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా