జియో ఫైబర్ Vs బీఎస్ఎన్ఎల్ బీబీజీ కాంబో
14-08-201914-08-2019 15:26:10 IST
2019-08-14T09:56:10.062Z14-08-2019 2019-08-14T09:56:05.257Z - - 20-04-2021

టెలికాం రంగంలో విప్లవానికి తెరతీసింది జియో. దేశీయ నెట్ వర్క్ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ తో సహా ఇతర సర్వీసు ప్రొవైడర్లు దిక్కులు చూస్తున్నారు. రోజుకో సంచలనంతో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్ త్వరలో రాబోతున్న జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలకు పోటీగా నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. బిఎస్ఎన్ఎల్ తన BBG కాంబో అన్ లిమిటెడ్ 1199 ఫ్యామిలీతో ఒకే ధరతో మూడు సర్వీస్ లను అందించడానికి ముందుకు వచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులకు మొబైల్ నెట్వర్క్, బ్రాడ్‌బ్యాండ్ మరియు ల్యాండ్‌లైన్ సేవలు అందుతాయి. భారతదేశంలో ఇలాంటి సేవలను అందించే ఏకైక ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ అని చెప్పకతప్పదు. ఈ ప్రణాళికతో వినియోగదారులు రోజుకు 10Mbps స్పీడ్ తో 30GB FUP పరిమితి డేటాను పొందుతారు. FUP పరిమితి తరువాత బ్రాడ్‌బ్యాండ్ యొక్క వేగం 2Mbps కి పడిపోతుంది. కానీ వినియోగదారులు అపరిమిత డేటాను 2Mbps స్పీడ్ తో సేవలు పొందవచ్చు. భారతదేశంలోని ఏదైనా నెట్‌వర్క్‌కు కాల్ చేయడానికి అపరిమిత కాల్‌తో ల్యాండ్‌లైన్ కనెక్షన్ కూడా ఉంటుంది. మొబైల్ కనెక్షన్ల కోసం మొత్తం మూడు సిమ్ కార్డులతో ఈ ప్లాన్ వస్తుంది. ఈ సిమ్ నంబర్లతో భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ అందించే ఈ సిమ్ కార్డులకు 1GB రోజువారీ డేటా కూడా ఉంటుంది. ఇక్కడ కూడా FUP పరిమితి తర్వాత ఇంటర్ నెట్ స్పీడ్ 80kbps కు తగ్గుతుంది. మొబైల్ కనెక్షన్లో ఒకదానికి ఉచితంగా ఆన్లైన్ టీవీ యాక్సిస్ ను కూడా పొందవచ్చు. ఈ మొత్తం ప్రయోజనాలు 1,199 రూపాయల వద్ద పొందవచ్చు. జియోఫైబర్ 2019 సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమవుతుందని సంస్థ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ ప్లాన్ తో పోలిస్తే జియోఫైబర్ సర్వీస్ ప్రారంభ ధర నెలకు 700 రూపాయలు మాత్రమే. మరి వినియోగదారులు ఏ సర్వీసు వైపు మొగ్గుచూపుతారో చూడాలి. జియో ఫైబర్ ఎఫెక్ట్ ఇంటర్నెట్ సర్వీసులు అందించేవారికి షాక్ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు టెక్నాలజీ నిపుణులు.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా