జియో ఫైబర్ బంపరాఫర్.. అదిరిపోయిందంతే!
31-08-202031-08-2020 17:29:43 IST
2020-08-31T11:59:43.833Z31-08-2020 2020-08-31T11:59:36.566Z - - 23-04-2021

టెలికాం రంగంలోనే కాదు, బ్రాడ్ బ్యాండ్ రంగంలోనూ ఇటీవలి కాలంలో విప్లవాత్మకమయిన మార్పులు వచ్చాయి, రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ విప్లవం తెచ్చిందనే చెప్పాలి. తాజాగా జియో ఫైబర్ వినియోగదారులకు ఆకర్షణీయ ఆఫర్ తో కొత్త ప్లాన్స్ తీసుకువచ్చింది. ప్రకటించింది. ‘ట్రూలి అన్ లిమిటెడ్’ అంటూ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వీటిని తాజాగా విడుదల చేసింది. సెప్టెంబర్ 1 నుండి జియోఫైబర్ కొత్త వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఒక నె లరోజులపాటు ఎలాంటి కండిషన్లు లేని 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది . వీరే కాదు ఆగస్టు 15, 31 మధ్య ప్లాన్ తీసుకున్న జియోఫైబర్ పాత కస్టమర్లకు కూడా 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుందని సంస్థ తెలిపింది. అలాగే 999, 1499 ప్లాన్లలో 1500 విలువైన 12 స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉచితంగా అందుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, జీ 5, సోనీ లివ్, లయన్స్‌గేట్ ప్లే, ఆల్ట్ బాలాజీలకు ఎలాంటి చందా చెల్లించాల్సిన అవసరం లేదు. 4కే సెట్ టాప్ బాక్స్‌ను కూడా పొందుతారు. ఇప్పటికే ఉన్న వినియోగదారులు కొత్త టారిఫ్ ప్లాన్ల ప్రయోజనాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ అవుతారు. తమ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి అపురూపమయిన ఆదరణ లభిస్తోందని సంస్థ వెల్లడించింది. కొత్త జియోఫైబర్ ప్లాన్ ద్వారా అపరిమిత ఇంటర్నెట్, అప్లోడ్ వేగం, డౌన్లోడ్ వేగం బాగుంటుంది. 150 ఎంబీపీఎస్, 4కే సెట్ టాప్ బాక్స్ ద్వారా అందుకోవచ్చు. అంతేకాదు ఉచిత వాయిస్ కాలింగ్ ఉచితం. జియో ఫైబర్ కొత్త ప్లాన్స్ ప్రకారం 399 రూపాయల ప్లాన్ లో 30 ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. అదే 699 రూపాయల ప్లాన్ లో 100 ఎంబీపీఎస్ స్పీడ్, 999 రూపాయల ప్లాన్ లో 150 ఎంబీపీఎస్ స్పీడ్ అందుకోవచ్చు. 499 రూపాయల ప్లాన్ లో300 ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. వర్క్ ఫ్రం హోం కస్టమర్లకు ఇది అద్భుతమయిన ప్లాన్లుగా చెప్పవచ్చు.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
21 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా