newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు కాల్‌ చేస్తే ఛార్జి!

10-10-201910-10-2019 10:17:01 IST
Updated On 10-10-2019 16:36:35 ISTUpdated On 10-10-20192019-10-10T04:47:01.103Z10-10-2019 2019-10-10T04:46:58.593Z - 2019-10-10T11:06:35.044Z - 10-10-2019

జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు కాల్‌ చేస్తే ఛార్జి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇన్నాళ్లూ ఉచితంగా కాల్స్‌ సౌకర్యం అందిస్తూ వచ్చిన జియో ఇప్పుడు కీలక ప్రకటన చేసింది. జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఐయూసీ ఛార్జీల విషయంలో ట్రాయ్‌ నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు, ల్యాండ్‌ లైన్స్‌ విషయంలో ఎలాంటి రుసుమూ వసూలు చేయబోమని జియో తెలిపింది. అక్టోబర్‌ 10 తర్వాత రీఛార్జి చేసే వారికి ఈ ఛార్జీలు వర్తిస్తాయని జియో ప్రకటనలో తెలిపింది. అయితే, వినియోగదారులు చెల్లించిన మొత్తానికి బదులుగా డేటాను తిరిగి ఇస్తామని ప్రకటించింది.

ప్రస్తుతం జియో కస్టమర్లు కాల్స్‌కు ఎలాంటి ఛార్జీలూ చెల్లించడం లేదు. డేటాకు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు. తాజాగా ట్రాయ్‌ నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల వినియోగదారుల నుంచి  ఐయూసీ ఛార్జీలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు జియో తెలిపింది. అయితే, ట్రాయ్‌.. ఐయూసీ ఛార్జీలు పూర్తిగా ఆపేసిన రోజున ఈ ఛార్జీలను వసూలు చేసేది లేదని తెలిపింది.

అదే సమయంలో కాల్స్‌కు వసూలు చేసిన మొత్తాన్ని డేటా రూపంలో తిరిగి వినియోగదారులకు అందిస్తామని చెప్పింది. దీని కోసం టాపప్‌ వోచర్లను కూడా ప్రకటించింది. అంటే మీరు టాప్ అప్‌ రీఛార్జి చేసుకొని అందులో పది రూపాయలు వాడితే ఒక జీబీ డేటా మీ ఖాతాలో అదనంగా చేరుతుంది. 

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) 2017లో ఇంటర్‌ కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీలను (ఐయూసీ) నిమిషానికి 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గించిన విషయం తెలిసిందే. 2020 జనవరి నుంచి ఈ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది. అదే జరిగితే ఈ ఛార్జీల విధానం డిసెంబరు 31 వరకే ఉంటుంది. గత మూడేళ్లలో జియో ఐయూసీ ఛార్జీల కింద ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా వంటి కంపెనీలకు రూ.13,500 కోట్లు చెల్లించింది.  ఇప్పటివరకు సొంత నిధుల నుంచే చెల్లించామని జియో తెలిపింది. 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   2 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle