జియో కొత్త యాప్... Jio POS Lite రీఛార్జ్ ఇక చిటికెలో పని!
17-04-202017-04-2020 12:54:54 IST
Updated On 17-04-2020 13:39:59 ISTUpdated On 17-04-20202020-04-17T07:24:54.145Z17-04-2020 2020-04-17T07:24:31.479Z - 2020-04-17T08:09:59.222Z - 17-04-2020

దేశీయ టెలికాం, డేటా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది రిలయెన్స్ జియో. తాజాగా జియో కొత్త యాప్ ను తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా జియో వినియోగదారులు తాము రీచార్జ్ చేస్తే కమీషన్ లభిస్తుంది. ఆ యాప్ ఉపయోగించడం తేలికే. ఆ యాప్ ను ఎలా ఉపయోగించాలంటే?భారతదేశ నంబర్ వన్ మొబైల్ ఆపరేటర్ జియో తన వినియోగదారుల కోసం కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా జియో వినియోగదారులు ఇతర జియో వినియోగదారులకు రీచార్జ్ చేస్తే క్యాష్ బ్యాక్ కొంత మొత్తం పొందవచ్చు. Jio POS Lite యాప్ ద్వారా జియో కస్టమర్ రీచార్జ్ లు చేయడానికి జియో భాగస్వామి/జియో అసోసియేట్ గా మారే అవకాశం కలుగుతుంది. మనదేశంలో కరోనావైరస్ మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను అమలుచేస్తోంది. లాక్ డౌన్ కారణంగా వినియోగదారులు రీచార్జ్ చేసుకోవడానికి ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. దీనికి తోడు భవిష్యత్తులో కూడా ఆన్ లైన్ రీచార్జ్ లను పెంచాలనేది జియో ప్రధాన ఉద్దేశంగా చెబుతోంది. .ప్రస్తుతానికి ఈ యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఈ యాప్ ఐఓఎస్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల ఉపయోగించే వినియోగదారులు ఈ యాప్ ను నేరుగా ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీ యాపే.డౌన్ లోడ్ చేసిన అనంతరం జియో పీఓఎస్ లైట్ యాప్ మూడు రకాలైన పర్మిషన్లను అడుగుతుంది. జియో కుటుంబంలోకి మీ కాంటాక్ట్స్ ని ఆహ్వానించడానికి కాంటాక్ట్స్ కోసం, దగ్గరలో ఉన్న జియో స్టోర్లు, జియో నెట్ హాట్ స్పాట్లను గుర్తించడానికి లొకేషన్, బిల్లులు, స్టేట్ మెంట్లు, ఇన్ వాయిస్ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి మీడియా పర్మిషన్లను అడుగుతుంది. వీటిని మీరు అందిస్తే .జియో అసోసియేట్లుగా మారడానికి తమ జియో మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని ఉపయోగించి ఈ యాప్ లో సైన్ అప్ అవ్వాలి. మొబైల్ నంబర్ ను అందించిన అనంతరం మీ మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని అందించడం ద్వారా యాప్ లో సైన్ అప్ అవ్వవచ్చు. జియో పీవోఎస్ లైట్ యాప్ ద్వారా మీరు గతంలో చేసిన లావాదేవీలను భద్రపరుచుకునేందుకు ఎం పిన్ ఎంచుకోవాలి, ఈ సెటప్ అంతా పూర్తయ్యాక మీరు జియో నంబర్లకు రీచార్జ్ చేస్తే ప్రతీ రీచార్జ్ కూ 4.16 శాతం కమీషన్ ను జియో అందిస్తుంది. అయితే ఈ యాప్ లో లావాదేవీలు ప్రారంభించడానికి ఎక్కువ మొత్తంలోనే మనీ లోడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ యాప్ కు ఒక్కసారి డబ్బులు రీచార్జ్ చేసుకుంటే మీ మార్జిన్ కూడా ముందుగానే లోడ్ అయిపోతుంది. ఉదాహరణకు మీరు రూ.2,000 లోడ్ చేస్తే.. ఈ వ్యాలెట్ లో నేరుగా రూ.2,083.33 లోడ్ అవుతుంది. అంటే మీ కమీషన్ 83 రూపాయలన్నమాట. రీచార్జ్ వ్యాలెట్ ను మొదటి సారి రీచార్జ్ చేయాలనుకునేవారు కనీసం రూ.1,000తో లోడ్ చేయాలి. జియో పీవోఎస్ డిజిటల్ వ్యాలెట్ నుంచి మొదటి రీచార్జ్ చేసిన అనంతరం తర్వాత నుంచి చేసే రీచార్జ్ లు కనీసం రూ.200గా ఉండాలి. మైజియో యాప్ తరహాలోనే ఇందులో కూడా వివిధ ఆప్షన్ల నుంచి మనీ లోడ్ చేసుకోవచ్చు. యూపీఐ, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ వంటి ఆప్షన్లతో పాటు, పేటీయం, ఫోన్ పే, జియో మనీ, మొబీ క్విక్ వంటి మొబైల్ వ్యాలెట్ల నుంచి కూడా మనీ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. దీనికి తోడు ఇందులో ఉన్న పాస్ బుక్ ఫీచర్ ద్వారా గత 20 రోజుల్లో జరిగిన లావాదేవీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో మీరు ఎవరి మొబైల్ అయినా రీఛార్జ్ చేయవచ్చు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా