జియో అదిరిపోయే ఆఫర్.. ఫీచర్ ఫోన్2 ఈఎంఐ@రూ141
18-08-202018-08-2020 13:04:24 IST
Updated On 18-08-2020 13:24:38 ISTUpdated On 18-08-20202020-08-18T07:34:24.545Z18-08-2020 2020-08-18T07:34:09.791Z - 2020-08-18T07:54:38.113Z - 18-08-2020

టెలికాం రంగంలో సరికొత్త సంచలనాలకు తెరతీసింది రిలయెన్స్ జియో. అద్భుతమయిన ఆఫర్లకైనా.. ఆకట్టుకోవడానికైనా రిలయన్స్ జియో ముందుంటుంది. అన్ని ఉచితమంటూ టెలికం మార్కెట్లో అడుగుపెట్టి.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది.కస్టమర్ల కోసం చౌకగా రూ1500కే 4జీ టెక్నాలజీ స్మార్ట్ఫోన్లను కూడా అందుబాటులోకి తెచ్చింది జియో.. ఇప్పటికే జియో ఫోన్లు మంచి సేల్స్ సాధించాయి. తర్వాత వాటి ధర రూ.699కి తగ్గించింది. ఇప్పుడు జియో ఫోన్ 2 విడుదల చేసింది. 2.4-అంగుళాల డిస్ప్లే మరియు డ్యూయల్ - సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 4G VoLTE స్లాట్ లో జియో సిమ్ ని మాత్రమే వాడాల్సి వుంటుంది. దీనితో పాటుగా 2జి స్లాట్ తో ఇతర ఆపరేటర్ సిమ్ ని వాడుకునే వెసులుబాటు కల్పించింది. జియో ఫోన్ తర్వాత రిలయన్స్ జియో తీసుకొచ్చిన రెండో మరియు బెస్ట్ ఫీచర్ ఫోన్ ఈ జియో ఫోన్ 2, ఈ ఫోన్, ఫీచర్ అయినా కూడా స్మార్ట్ ఫోనుకు ఏ మాత్రం తీసిపోదంటున్నారు. వాట్సాప్, యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి యాప్స్ కూడా అందుబాటులో వున్నాయి. ఈ ఫీచర్ ఫోన్ ధర రూ. 2,999. అందరికీ అందుబాటులోకి తేవడానికి నెలకు కేవలం 141 రూపాయల ఈఎంఐతో కూడా ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. రిలయన్స్ జియో నుంచి ఈ జియో ఫోన్ మరియు జియో ఫోన్ 2 పైన ఆకర్షణీయమైన ప్లాన్ కూడా తెచ్చింది.. రూ . 49 ప్లాన్ కింద 1జీబీ డేటా, 50 ఉచిత ఎస్ఎంఎస్, జియో నుండి జియో కి ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్, .రూ .99 ప్లాన్, 14 జీబీడేటా, ఫ్రీ కాలింగ్, 300 ఎస్ఎంఎస్, రూ .153 ప్లాన్ ద్వారా, 42జీబీ డేటా, ఉచిత కాలింగ్, జీయో యాప్స్ కి యాక్సెస్, మరియు ఉచిత అపరిమిత ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. నెలరోజుల పాటు ఇవి అందుబాటులో వుంటాయి. జియో ఫోన్ 2 స్సెసిఫికేషన్లు *2.4-అంగుళాల డిస్ప్లే *డ్యూయల్ - సిమ్ సపోర్ట్ * 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్ * 4G టెక్నాలజీ వోల్ట్ *వాట్సాప్, యూట్యూబ్, ఫేస్ బుక్ *2,000 ఎంఏహెచ్ బ్యాటరీ *2 ఎంపీ కెమేరా 03 ఫ్రంట్ కెమేరా *రూ 49 ప్లాన్.. జియోటు జియో అన్ లిమిటెడ్ కాల్స్ *రూ.99 ప్లాన్ 14 జీబీడేటా, ఫ్రీ కాలింగ్, 300 ఎస్ఎంఎస్ *రూ .153 ప్లాన్ 42జీబీ డేటా, ఉచిత కాలింగ్ *ధర రూ. 2,999.. ఈఎంఐ రూ. 141 జియో మార్ట్ యాప్... కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా