జియోలో ఫేస్ బుక్ భారీ పెట్టుబడి
22-04-202022-04-2020 12:41:54 IST
Updated On 22-04-2020 13:57:48 ISTUpdated On 22-04-20202020-04-22T07:11:54.773Z22-04-2020 2020-04-22T07:06:45.670Z - 2020-04-22T08:27:48.268Z - 22-04-2020

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. రిలయెన్స్ జియోలో భారీ పెట్టుబడి పెట్టనుంది. జియో ప్లాట్ ఫామ్స్ లో 9.90 శాతం వాటా కొనుగోలు చేయనుంది. దీని విలువ 43,574 కోట్లు వుంటుందని అంచనా. ఇరుసంస్థలు ప్రకటనలు విడుదల చేశాయి. తాజాగా జియోలో అతి పెద్ద మైనారిటీ వాటాదారుగా ఫేస్ బుక్ అవతరించింది. ఆర్ఐఎల్ లో భాగమయిన జియో దేశంలోనే అతి పెద్ద నెట్ వర్క్. 2016లో జియో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకూ 39 కోట్లమంది వినియోగదారులు వున్నారు. కరోనా వైరస్ సంక్షోభం అనంతరం భారత ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందని, జియో, ఫేస్ బుక్ కలిసి ముందుకు సాగుతాయని రెండు సంస్థలు ప్రకటించాయి. డిజిటల్ వ్యవస్థ బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జియోతో జతకట్టడం ద్వారా మరింతగా తమ కార్యకలాపాలు విస్తరించుకునే అవకాశం ఉంటుందని ఫేస్ బుక్ తెలిపింది. ఫేస్ బుక్ చేతిలో వున్న వాట్సాప్, ఇన్ స్టాగ్రాంలలో భారతీయ కస్టమర్లే ఎక్కువగా వున్నారు. ఇప్పుడు జియోతో జతకడితే మరింతగా విస్తరించుకోవచ్చని సీఈవో మార్క్ జుకర్ బర్గ్ అన్నారు. ప్రతిభ కలిగిన పారిశ్రామికవేత్తలకి భారత్ నిలయమని, డిజిటల్ వైపు భారత్ అడుగులు వేస్తున్న వేళ ఫేస్ బుక్-జియో బంధంపై సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. తమ ఒప్పందం దేశవ్యాప్తంగా ప్రజలకు వాణిజ్య అవకాశాలను అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. ఈ డీల్ ప్రారంభం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఇందుకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి, మొత్తం జియో బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు తమ ఆధీనంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్, రిలయన్స్ ఆధీనంలోని ఇ-కామర్స్ వెంచర్ జియో మార్ట్ మధ్య సహకారాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. చిన్న సంస్థలు కస్టమర్లను కనుగొని కమ్యూనికేట్ చేయడంతో పాటు, వ్యాపారాలను పెంచుకోవడానికి ఈ డీల్ ఉపయోగపడనుంది. భారతదేశంలోని కొత్త ఉద్యోగాలు, చిరు వ్యాపారాల్లో కొత్త అవకాశాలను సృష్టించడానికే తాము జియోతో జతకట్టామని ఫేస్ బుక్ అధినేత వెల్లడించారు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా