జియోలోకి పెట్టుబడుల వరద.. గూగుల్ నుంచి రూ.33వేల కోట్లు
15-07-202015-07-2020 15:07:56 IST
Updated On 15-07-2020 15:16:16 ISTUpdated On 15-07-20202020-07-15T09:37:56.193Z15-07-2020 2020-07-15T09:34:36.106Z - 2020-07-15T09:46:16.219Z - 15-07-2020

జియోలోకి పెట్టుబడులు పెరుగుతున్నాయి. జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో రూ.33,737 కోట్లు పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. జియోలో గూగుల్ సంస్థ 7.7 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని ఆయన తెలిపారు. 43వ యానువల్ జనరల్ మీటింగ్‌లో ఈ మేరకు ప్రకటన చేశారు ముకేష్ అంబానీ. పలు అంతర్జాతీయ కంపెనీ పెట్టబడులతో గత మూడు నెలల్లో రూ.1,52,056 కోట్ల నిధులను సమీకరించినట్లు వెల్లడించారు.ఏప్రిల్ 22 నుంచి రిలయెన్స్ జియోలోకి పెట్టబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఆరువారాలు.... ఆరు కంపెనీలు. .జియోలో రూ.87వేల కోట్ల పెట్టుబడులు పలు దిగ్గజ కంపెనీలతో వరుసగా డీల్స్ కుదుర్చుకుంటోంది జియో. ఫేస్బుక్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్ రెండుసార్లు, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, కేకేఆర్, ముబదాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, ఏడీఐఏ, టీపీజీ, ఎల్ క్యాటర్టాన్, పీఐఎఫ్ సంస్థలు జియో ప్లాట్‌ఫామ్స్‌తో డీల్స్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా రిలయన్స్‌కు ఇది ఫస్ట్ వర్చువల్ మీటింగ్. దేశవ్యాప్తంగా 500ల ప్రాంతాల నుంచి లక్ష మంది షేర్ హోల్డర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత మూడునెలల నుంచి కరోనా వల్ల పెట్టుబడులు ఆగినా.. జియో మాత్రం ఆరు ప్రముఖ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించింది. దేశీయంగా స్తబ్ధంగా వున్నా అంబానీ మాత్రం తన దూకుడు ప్రదర్శించారు. జియో పెట్టుబడులతో అది నిజమయింది. ఫేస్ బుక్ తరవాత జియో పెట్టుబడుల విషయంలో రెండవ స్థానంలో వుంది. జియోలో మొత్తం పెట్టుబడులు * ఫేస్బుక్ పెట్టుబడులు రూ. 43,574 కోట్లు 9.99 శాతం వాటా * సిల్వర్‌లేక్ పార్ట్నర్స్ పెట్టుబడి రూ.5,656 కోట్లు 1.15 శాతం వాటా * విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ పెట్టుబడి రూ.11,367 కోట్లు 2.32 శాతం వాటా * జనరిక్ అట్లాంటిక్ పెట్టుబడులు రూ.6,598 కోట్లు 1.34 శాతం వాటా * కేకేఆర్ పెట్టుబడులు రూ.11,367 కోట్లు 2.32 శాతం వాటాతో * ముబదాల పెట్టుబడులు రూ.9,094 కోట్లు 1.8 5శాతం వాటా * గూగుల్ పెట్టుబడులు రూ.33,737 కోట్లు 7.7 శాతం వాటా

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
11 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా