facebooktwitteryoutubeinstagram

ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice?

{"1":1046,"2":1105,"3":289,"4":33}

Narendra Modi
1060
Rahul Gandhi
1116
Mayawati
299
Mamata Banerjee
38
BITING NEWS :
*రజనీకాంత్ అభిమానులకు శుభవార్త... అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని రజనీకాంత్‌ ప్రకటన *రాహుల్‘న్యాయ్’ బ్యానర్లపై ఈసీ సీరియస్.. నోటీసులు జారీ* ఒకే వేదికపై బద్ధ శత్రువులు... ములాయం, మాయావతి *మే తెలంగాణలో పరిషత్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్.. 6న మొదటి విడత, మే 10న రెండో విడత, మే 14న మూడో విడత పోలింగ్‌ *సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... తన శాపం వల్లే ఐపీఎస్‌ ఆఫీసర్ హేమంత్‌ కర్కరే మరణించారన్న సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ *రాహుల్‌ గాంధీపై బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ పరువునష్టం దావా * ముగిసిన రెండో విడత పోలింగ్... 68 శాతం పోలింగ్ నమోదు *హైదరాబాద్ లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు

జియోఫోన్ యూజర్లకు శుభవార్త

28-01-201928-01-2019 18:45:23 IST
2019-01-28T13:15:23.834Z28-01-2019 2019-01-28T13:15:21.068Z - - 20-04-2019

జియోఫోన్ యూజర్లకు శుభవార్త
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు IRCTC యాప్ ద్వారా రైలు వివరాలు, బుకింగ్స్ తదితర పనులు సులువుగా చేసుకోగలరు. మరి... జియోఫోన్ యూజర్స్‌? ఈ వెలితిని గ్రహించిన జియో సంస్థ... తమ యూజర్స్‌కి అనుకూలంగా ఉండేలా ఒక కొత్త యాప్‌ని తీసుకొచ్చింది. దాని పేరే ‘జియోరైల్’ (JioRail)! అవును... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియోఫోన్ యూజర్లకు ఆ సంస్థ ఈ తీపి కబురు అందించింది. జియో యాప్ స్టోర్‌లోకి వెళ్ళి... ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. IRCTC తరహాలోనే ఉండే ఈ యాప్ ద్వారా పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవడం, రైలు సమాచారం, వేళలు, రూట్స్, సీట్లు, బుకింగ్స్ వివరాల్ని తెలుసుకోవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇ-వాలెట్ సేవలు వంటి వివిధ చెల్లింపులకు ఈ యాప్ మద్దతిస్తుంది. దీని ద్వారా తత్కాల్ టిక్కెట్ కూడా బుక్ చేసుకునే సదుపాయం ఉంది. నేరుగా JioRail యాప్‌లోనే అకౌంట్ క్రియేట్ చేసుకుని... ఈ సౌకర్యాలు పొందవచ్చు.

ఈ శుభవార్తతోపాటు తమ యూజర్స్‌కి ఈమధ్యే మరో బంపరాఫర్ ప్రకటించింది జియో సంస్థ! రూ.594, రూ.297 అనే రెండు కొత్త ప్లాన్‌లను మంచి ఆప్షన్స్‌తో లాంచ్ చేసింది. రూ.594 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే... యూజర్లు 168 రోజులపాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, నెలకు 300 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకి 0.5 జీబీ డేటాను పొందవచ్చు. వీటితో పాటు జియో సూట్ యాప్స్‌ను కూడా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక రూ.297 ప్లాన్‌ను రీఛార్స్ చేయించుకుంటే... 3 నెలలపాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌, నెలకు 300 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకి 0.5 జీబీ డేటాను యూజర్స్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లోనూ జియో సూట్ యాప్స్‌ను ఫ్రీగా పొందవచ్చు. మరోవైపు... గిగా ఫైబర్‌ సేవల్ని ఈ మార్చి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జియో ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై నగరాల్లో దీనిపై టెస్టింగ్స్ నిర్వహిస్తున్నారు.


Syed Abdul Khadar Jilani


సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ- కంటెంట్ రైటర్‌. జర్నలిజంలో ఐదేళ్ళ అనుభవం. ప్రముఖ మీడియా సంస్థ టీవీ9, తొలివెలుగు, ఇతర డిజిటల్ మీడియా సంస్థల్లో పనిచేశారు. సినిమా కథనాలు, రివ్యూలు, రాజకీయాలు, టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ వంటి అంశాలపై మంచి అవగాహన. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్.ఇన్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.
 syedabdul@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle