newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఛార్జింగ్ కష్టాలుండవ్.. రియల్ మీ 20నిముషాల్లో ఫుల్ ఛార్జింగ్

22-07-202022-07-2020 10:09:29 IST
Updated On 22-07-2020 12:19:00 ISTUpdated On 22-07-20202020-07-22T04:39:29.912Z22-07-2020 2020-07-22T04:39:03.260Z - 2020-07-22T06:49:00.424Z - 22-07-2020

ఛార్జింగ్ కష్టాలుండవ్.. రియల్ మీ 20నిముషాల్లో ఫుల్ ఛార్జింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్ ఫోన్లు వచ్చాక మరో కొత్త సమస్య వినియోగదారులను వేధిస్తూ వుంటుంది. అనేక యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవడంతో ఛార్జింగ్ చిటికెలో అయిపోతుంది. దీంతో వినియోగదారులు పవర్ బ్యాంకులు, ఛార్జింగ్ పాయింట్ల కోసం ఎదురుచూడడం కామన్. అయితే ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ కొత్త ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సాంకేతికతను తీసుకొచ్చింది. 125w ఫాస్ట్‌ఛార్జింగ్‌ సదుపాయాన్ని తీసుకువచ్చింది. 

దీనికి అల్ట్రాడార్ట్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ అని పేరు పెట్టింది. దీనిద్వారా కేవలం 20 నిముషాల్లోనే మీ ఫోన్ ఛార్జి అవుతుంది. 4000 ఎంఎహెచ్ బ్యాటరీ వున్న ఫోన్ అంత తక్కువ టైంలోనే ఛార్జి కావడం వలన వినియోగదారులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని రియల్ మీ సంస్థ అంటోంది. 

33 శాతం ఫోన్ ఛార్జింగ్ కేవలం 3 నిముషాల్లోనే పూర్తవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు వుండవని, ఫోన్ హీట్ కాదని, ఉష్ణోగ్రత 40 డిగ్రీలు మించదని రియల్ మీ అంటోంది. 13 నిముషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుందని, 5 జీ టెక్నాలజీ ఫోన్ అయితే మరో ఆరేడు నిముషాలు అంటే 20 నిముషాల టైంలో ఫుల్ ఛార్జింగ్ అవడం ఖాయం అంటోంది. గేమ్స్ ఆడుతూ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో రియల్ మీ ఎక్స్ 50 ప్రో 5 జీ ఫోన్లో 65 డబ్ల్యు ఛార్జింగ్ సదుపాయం అందించింది. కానీ ఇప్పుడు ఏకంగా రియల్ మీ 125 డబ్ల్యు ఛార్జింగ్ ఇచ్చింది, అలాగే ఒప్పో కూడా 125 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తోంది. రియల్ మీ సంస్థ మాత్రం ఈ టెక్నాలజీని ఎప్పుడు బహిరంగ మార్కెట్లోకి విడుదలచేస్తుందో స్పష్టత ఇవ్వలేదు. 

 

 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle