ఛార్జింగ్‌లో పేలిన సెల్ ఫోన్..పోయిన కంటి చూపు
29-04-202029-04-2020 11:04:48 IST
Updated On 29-04-2020 11:27:39 ISTUpdated On 29-04-20202020-04-29T05:34:48.793Z29-04-2020 2020-04-29T05:32:13.256Z - 2020-04-29T05:57:39.168Z - 29-04-2020

మనం యథాలాపంగా చేసే కొన్ని పనులు మనకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడతాయి. ఈరోజుల్లో సెల్ ఫోన్ నిత్యావసరాల్లో ఒకటిగా మారిపోయింది. సెల్ ఫోన్ ఛార్జింగులో పెట్టడం, బ్యాటరీలు పేలిపోవడం ప్రాణాల మీదకు రావడం వంటి ప్రమాదాలు సాగుతూనే వున్నాయి. సెల్ ఫోన్ మాట్లాడుతూ రైలు పట్టాలపై నడవడం మామూలైపోయింది. తాజాగా చెన్నైలో ఓ యువతి సెల్ ఫోన్ కారణంగా అంధురాలిగా మారిపోయింది. ఆమె చిన్నపాటి నిర్లక్ఫ్యం ఆమె పాలిట శాపమయింది. సెల్‌ఫోన్ ఛార్జింగ్‌లో పెట్టి వీడియో కాల్ మాట్లాడుతున్న సయయంలో దురదృష్టవశాత్తూ ఫోన్ పేలడంతో ఓ యువతి చూపు కోల్పోయింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరువారూరు జిల్లా నీడామంగళం ముట్టయ్యకొత్తనార్ తందు ప్రాంతానికి చెందిన సుకుమార్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన కుమార్తె ఆర్తి తన తండ్రితో వీడియో కాల్లో మాట్లాడుతోంది. ఆ సమయంలో ఫోన్ ఛార్జింగులో వుంది. ఫోన్ బ్యాటరీ అకస్మాత్తుగా సెల్ పేలడంతో... ఆ ముక్కలు ఆర్తి కళ్ళలో గుచ్చుకున్నాయి. చెవిలోకి కూడా వెళ్లాయి. దీంతో కుటుంబీకులు ఆర్తీని వెంటనే నీడామంగళం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్సకు తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకుప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఇప్పుడు చూపు కోల్పోయింది. సెల్ ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఉపయోగిస్తూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నా ఎవరూ దాని గురించి పట్టించుకోవడం లేదు. ఫోన్ వాడకంపై అజాగ్రత్తగా ఉండటం వల్లే గాయపడటంతో పాటు, ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినా జనాల్లో అవగాహన లేకుండా పోతోంది. ఛార్జింగ్ పెట్టిన ఫోన్‌ని అలాగే మాట్లాడటం, తడి చేతులతో ఛార్జింగ్ పెట్టడంతో పాటు రాత్రంతా చార్జింగ్ పెట్టిన ఫోన్లు విపరీతంగా వేడెక్కి పేలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఫోన్లు వాడకాలపై అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఈ అమ్మాయిలా జీవితం చీకటిమయం అవుతుంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా