newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చౌకధరల స్మార్ట్ ఫోన్లకు ఇక రాంరాం..

18-02-202018-02-2020 11:02:04 IST
2020-02-18T05:32:04.327Z18-02-2020 2020-02-18T05:31:53.255Z - - 17-04-2021

చౌకధరల స్మార్ట్ ఫోన్లకు ఇక రాంరాం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దిగ్గజ సంస్థలకు స్వర్గధామంలా విరాజిల్లుతున్న భారత మార్కెట్లో బడ్జెట్‌ ధరల స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు వెలవెలబోతున్నాయట. ఒకపుడు బడ్జెట్‌ ఫోన్లు, లేదా ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్ల డిమాండ్‌లో ప్రపంచంలో ఏకైక మార్కెట్‌గా పేరొందిన ఇండియాలో ఇపుడు ట్రెండ్‌ మారిందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదించింది. ముఖ్యంగా రూ. 5వేల లోపు  ఖరీదున్న మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు యువభారతం ఆసక్తి చూపడం లేదని తెలిపింది.

భారత మార్కెట్లో రూ.5,000 లోపు ధరలో లభ్యమయ్యే స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణం కాస్త ఖరీదైన, ప్రీమియం ఫోన్లకు భారీ డిమాండ్ ఏర్పడటమేనని మార్కెట్ వర్గాల విశ్లేషణ. చివరకు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సైతం అధిక ధరలతో కూడిన మొబైల్ ఫోన్ల పట్ల వ్యామోహం పెంచుకుంటున్నారు. తమ విలువైన సమయాన్ని వీరు టిక్ టాక్ వీడియోలను షూట్ చేయడానికి, ఫేస్ బుక్ ఉపయోగించడానికి వెచ్చిస్తున్నారు. 

అయితే రూ. 5,000ల కంటే అధిక ధర ఉన్న ఫోన్లలోనే ఈ సోషల్ మీడియా యాప్స్‌ను సమర్థంగా వినియోగించుకోవడానికి వీలుపడుతుండటంతో అనివార్యంగా వీరంతా అధిక ధరలతో కూడిన స్మార్ట్ ఫోన్లవైపే మొగ్గు చూపుతున్నారు. సాంకేతికతలో నాణ్యత పెరిగేకొద్దీ మెమరీ పవర్ ఎక్కువగా ఉండే స్మార్ట్ ఫోన్లకు అధికంగా డిమాండ్ ఏర్పడటం అందరికీ తెలిసిన విషయమే.

నిజానికి ఈ సూచనలు 2018లోనే మొదలైనాయని కౌంటర్ పాయింట్‌  రీసెర్చ్‌ పరిశోధన తేల్చింది. 2018లో 25శాతం క్షీణించిన ఈ కేటగిరీ అమ్మకాలు 2019 లో 45 శాతానికి పెరిగింది.  ప్రధానంగా ఎంట్రీ లెవల్ కేటగిరీ రూ .5 వేల స్మార్ట్‌ఫోన్‌లలో లభించే మార్జిన్ కంటే దేశంలోని ఇంటీరియర్‌ పరికరాల ఖర్చు ఎక్కువ అవుతోందని  తెలిపింది. అలాగే, ఈ ఫోన్‌ల డిమాండ్ కూడా గణనీయంగా పడిపోయిందని పేర్కొంది. దీనికి తోడు ఫీచర్ ఫోన్ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లకు మారిపోవడం కూడా ఒక కారణం. అయితే దేశంలో ఇంకా 450 మిలియన్ల ఫీచర్ ఫోన్లు వినియోగంలో ఉన్నరప్పటికీ, అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు చాలామంది వినియోగదారులు ఆసక్తి చూపడంలేదు. 

ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ తయారీదారులు చౌక ధరలతో కూడిన మొబైల్ ఫోన్ల కంటే అధికధరలతో కూడిన మొబైల్ ఫోన్ల తయారీ పట్ల మక్కువ చూపుతున్నారు. ఫోన్ల పంపిణీ ఖర్చు వాస్తవ ధర కంటే ఎక్కువ కావడంతో చౌకగా అమ్మడం కంటే నాణ్యమైన ఫోన్లను తయారు చేసి అధిక ధరకు అమ్ముకోవడం బెటర్ అనే అభిప్రాయం ఫోన్ల తయారీ దారుల్లో బలపడింది. అందుకే చౌక ధర ఫోన్లకు డిమాండ్ పడిపోవడం 2018తో మొదలై 2019లోనే 45 శాతం మేరకు పడిపోయింది. పైగా నాణ్యమైన ఫోన్లకోసం అధిక ధరలు వెచ్చంచడం లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది.  

మరోవైపు, భారతదేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌ల సగటు ధర క్రమంగా పెరుగుతోందని ఐడీసీ డేటా ద్వారా తెలుస్తోంది. ఇది 2018లో 159 డాలర్లు (సుమారు రూ. 11,350 ) నుండి 2019 లో 160 డార్లు (సుమారు రూ. 11,421) కు పెరిగింది.  ప్రస్తుతం 170 డాలర్ల (సుమారు రూ. 12,135 ) స్థాయికి చేరింది. ఈ గణాంకాల ప్రకారం బట్టి చూస్తే ఎంట్రీ లెవల్లో ఎక్కువ ఫోన్లను విక్రయిస్తున్న ఏకైక ముఖ్యమైన బ్రాండ్ షావోమినే కావడం గమనార్హం.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle