newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

చైనా మొబైల్స్‌కు భారత్ మార్కెట్లో షాక్. పుంజుకుంటున్న స్థానిక కంపెనీలు

26-07-202026-07-2020 06:23:00 IST
Updated On 26-07-2020 07:23:35 ISTUpdated On 26-07-20202020-07-26T00:53:00.263Z26-07-2020 2020-07-26T00:52:56.259Z - 2020-07-26T01:53:35.792Z - 26-07-2020

చైనా మొబైల్స్‌కు భారత్ మార్కెట్లో షాక్. పుంజుకుంటున్న స్థానిక కంపెనీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా నేపథ్యంలో సరఫరా మార్గాలు దెబ్బతినిపోవడం, సరిహద్దు ఘర్షణల కారణంగా భారతీయులు మనోభావాలు దెబ్బతినడంతో భారత్ మొబైల్ మార్కెట్ చైనా బ్రాండ్లకు షాక్ కలిగిస్తోంది. మూడు నెలల క్రితం వరకు భారత మొబైల్ మార్కెట్లో 81 శాతం షేరును ఆక్రమించి తిరుగులేని స్ధానం సాధించిన చైనా మొబైల్ బ్రాండ్లు ఇప్పుడు 72 శాతానికి పడిపోవడమే కాకుండా రోజురోజుకూ తమ ఆధిపత్యాన్ని కోల్పోతున్నాయి.

దీంతో ప్రజల సెంటిమెట్లు ఎక్కువకాలం పనిచేయవని ధీమా వ్యక్తం చేసిన దిగ్గజ బ్రాండ్ కంపెనీలు తన వ్యూహాలను పునరాలోచించుకుంటున్నాయి. పైగా అపిల్ సంస్థ భారత్‌లో స్థానికంగా ఐఫోన్ 11 వెర్షన్‌ను తయారు చేసి విడుదల చేయనుండటం, దేశీయ బ్రాండ్ కంపెనీలు గణనీయంగా మార్కెట్ షేర్‌ను సాధిస్తుండటం కారణంగా చైనా కంపెనీలు తలపట్టుకుంటున్నాయి. పైగా భారత మార్కెట్లో మూడో స్థానంలో ఉన్న శాంసంగ్ జూన్ నెలలో  26 శాతం పుంజుకుని రెండో స్థానంలోకి రావడం చైనా కంపెనీలను కలవరపరుస్తోంది.

వివరాల్లోకి వెలితే భారత మొబైల్ మార్కెట్‌లో చైనా బ్రాండ్ల షేర్ క్రమంగా పడిపోతోంది. కరోనా వైరస్ కారణంగా సరఫరా గొలుసు తెగిపోవడం, చైనా వ్యతిరేక సెంటిమెంట్ కారణంగా జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి చైనీస్ మొబైల్ మార్కెట్ షేర్ 72 శాతానికి పడిపోయింది. అంతకుముందు మూడు నెలలు ఇది 81 శాతంగా ఉన్నట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది.

మొబైల్ రంగంలో చైనీస్ బ్రాండ్స్ అయిన ఒప్పొ, వివో, రియల్‌మి వంటివి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని సంపాదించాయి. అయితే, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వాటి మార్కెట్ షేర్ గణనీయంగా పడిపోయినట్టు కౌంటర్‌పాయింట్ నివేదిక పేర్కొంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో 81 శాతంగా ఉన్న వీటి మార్కెట్ షేర్ జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి 72 శాతానికి పోయినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అనలిస్ట్ శిల్పి జైన్ తెలిపారు. 

అయితే దీనికి ప్రధాన కారణం.. ఒప్పో, వివో, రియల్‌మి వంటి కొన్ని ప్రధాన చైనీస్ బ్రాండ్ల సరఫరాలో అంతరాయం, చైనా వ్యతిరేక సెంటిమెంట్‌తోపాటు 50కిపైగా చైనీస్ యాప్‌లను నిషేధించడమే. అలాగే భద్రతాపరమైన కారణాల వల్ల చైనా నుంచి ముఖ్యమైన వస్తువుల దిగుమతుల్లో ఆలస్యం వంటివి కూడా ఇందుకు దోహదం చేశాయి. ఇండియా-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కూడా ఇందుకు మరో కారణం’’ అని శిల్పి వివరించారు. 

దీనికి తోడు చైనా కంపెనీలకు దీటుగా స్థానిక మొబైల్ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, లావా వంటి మళ్లీ పుంజుకోవడం కూడా ఇందుకు మరో కారణమని శిల్పి పేర్కొన్నారు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మొబైల్ మార్కెట్‌లో షియోమీ 29 శాతం షేర్‌తో అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో శాంసంగ్ (26 శాతం), వివో (17), రియల్‌మి (11 శాతం), ఒప్పో (9శాతం), ఇతర కంపెనీలు (8 శాతం) ఉన్నాయి. 

మార్చితో ముగిసిన త్రైమాసికంలో షియోమీ 30 శాతం మార్కెట్ షేర్‌తో తొలి స్థానంలో నిలవగా, వివో 17 శాతం, రియల్‌మి 14 శాతం, ఒప్పో 12 శాతం మార్కెట్ షేర్‌తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 

మరోవైపున ఈ త్రైమాసికంలో 16 శాతంతో మూడో స్థానంలో ఉన్న శాంసంగ్.. జూన్‌లో పుంజుకుని 26 శాతం మార్కెట్ షేర్‌తో రెండో స్థానానికి ఎగబాకింది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle