newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చైనాకు మైండ్ బ్లాంక్... పబ్ జి సహా 119 యాప్‌లపై బ్యాన్

02-09-202002-09-2020 18:31:59 IST
Updated On 02-09-2020 18:47:19 ISTUpdated On 02-09-20202020-09-02T13:01:59.314Z02-09-2020 2020-09-02T13:01:49.055Z - 2020-09-02T13:17:19.993Z - 02-09-2020

 చైనాకు మైండ్ బ్లాంక్... పబ్ జి సహా 119 యాప్‌లపై బ్యాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండియా దెబ్బకు చైనా దిమ్మతిరిగిపోతోంది. చైనాపై ఇండియా మరోసారి డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. చైనా-భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తొలుత టిక్ టాక్, హలో సహా 59 చైనీస్ యాప్‌ల‌పై నిషేధం విధించింది. తాజాగా మరోసారి భారత్ తన ప్రతాపం చూపించింది. ప్రస్తుతం పబ్జీ సహా 119 యాప్‌లపై నిషేధం విధించినట్టు ఐ అండ్ బీ శాఖ తెలిపింది.

తాజా చర్యతో భారత్ నిషేధించిన చైనీస్ మొబైల్ యాప్‌ల సంఖ్య 224కు చేరింది. గల్వాన్ లోయలో చైనా బలగాలతో ఘర్షణలు తలెత్తిన తర్వాత 59 యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో 49 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ యాప్‌లు యూజర్లకు తెలియకుండా వారి సమాచారాన్ని సేకరిస్తున్నాయని.. వాటిని భారత్ వెలుపల ఉన్న సర్వర్లకు తరలిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

భారత్ నిషేధించిన జాబితా ఇదే. 

పబ్జీ మొబైల్ నార్డిక్ మ్యాప్: లివిక్, పబ్జీ మొబైల్ లైట్, వియ్‌చట్ వర్క్, వియ్‌చాట్ రీడింగ్, బైడూ, బైడూ ఎక్స్‌ప్రెస్ ఎడిషన్, మెసేజ్ లాక్, స్మార్ట్ యాప్ లాక్, యూ-డిక్షినరీ, వీపీఎన్ ఫర్ టిక్ టాక్ తదితర యాప్‌లు నిషేధిత యాప్‌ల జాబితాలో ఉన్నాయని కేంద్రం తెలిపింది. భారత దేశ సమగ్రతకు, రక్షణకు హాని కలిగించేలా ఉన్నయాప్‌లపై నిషేధం విధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. సరిహద్దుల్లో భారత్, చైనా సైన్యాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.

చైనీస్ యాప్‌లపై కేంద్రం మరోసారి నిషేధం విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆగస్టు 29న రాత్రి చైనా బలగాలు పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలోని ఎత్తయిన ప్రాంతాలను ఆక్రమించడానికి ప్రయత్నించగా.. భారత్ అడ్డుకుంది. ఈ ప్రాంతాన్ని ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. పాంగాంగ్ సరస్సు ఉత్తర ప్రాంతంలోనూ సైన్యాన్ని సర్దుబాటు చేసింది. భారత్ చైనా సైన్యంపై పైచేయి సాధించిందని చెబుతున్నారు. 

భారత్ తో సహా అమెరికాలోనూ టిక్ టాక్ పై బ్యాన్ విధించింది. సోషల్ మీడియా యాప్‌ ‘టిక్‌టాక్‌’ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  డెడ్ లైన్ ఇచ్చారు. టిక్ టాక్ ని అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి విక్రయించాలని, లేనట్లయితే ఆ యాప్‌ను తమ దేశంలో నిషేధిస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు  టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను ఒక అమెరికన్ కంపెనీకి విక్రయించడానికి ఆరు వారాల గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఏదో ఒకటి తేల్చుకోవాలని లేదంటే నిషేధం తప్పదని స్పష్టం చేశారు. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle