చైనాకు భారీ షాక్.. పబ్ జి సహా 47 యాప్స్ బ్యాన్?
27-07-202027-07-2020 17:42:23 IST
Updated On 27-07-2020 18:42:12 ISTUpdated On 27-07-20202020-07-27T12:12:23.305Z27-07-2020 2020-07-27T12:11:52.493Z - 2020-07-27T13:12:12.587Z - 27-07-2020

భారత ప్రభుత్వం చైనా దేశ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టేందుకు అడుగులు వేస్తోంది. చైనాకు తాజాగా భారత్ మరో భారీ షాకిచ్చింది. ఇప్పటికే టిక్‌టాక్, హెలో సహా 59 చైనా యాప్స్‌ని భారత ప్రభుత్వం నిషేధించింది. తాజాగా భారత్ ఇప్పుడు మరో 47యాప్స్ బ్యాన్ చేసింది. పబ్జీ, లూడో కింగ్ లాంటి 47 యాప్స్ ను బ్యాన్ చేసినట్టు చెబుతున్నారు. ఇంతకు ముందు నిషేధించిన 59 యాప్ లకు క్లోన్ లుగా ఈ 47 పనిచేస్తున్నాయని ఇండియా గుర్తించింది. టిక్ టాక్ నిషేధంతో ఆ సంస్థకు భారీగా నష్టం చేకూరుతోంది. భారత ప్రభుత్వం తాజాగా నిషేధించిన 47 చైనా యాప్ ల జాబితా త్వరలో విడుదల అవుతుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ టెలికాం శాఖ, ఐటీ నిపుణులు చైనాకు చెందిన యాప్స్, వాటి డేటా, భారత పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతున్న అంశాలపై పరిశోధించారు. చైనాకు చెందిన వివిధ యాప్స్, పాపులర్ గేమింగ్ యాప్స్ అయిన పబ్జీ మొబైల్, లూడో వాల్డ్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అలీ ఎక్స్‌ప్రెస్ లాంటివి ఉండే అవకాశం ఉన్నాయి.గాల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి అనంతరం చైనా వస్తువులు, యాప్స్, స్మార్ట్ఫోన్లు నిషేధించాలన్న డిమాండ్లు వచ్చాయి. అదీ కాక ఇన్ఫర్మేషన్ లీక్ అవుతోందని గుర్తించిన భారత నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనా మూలాలున్న 59 యాప్స్‌ని నిషేధించింది. తాజాగా మరిన్ని ఈ జాబితాలో వుండడం, మోస్ట్ పాపులర్ పబ్ జి కూడా నిషేధించేందుకు రంగం సిద్ధమయింది.

వాట్సప్ కు భారత్ వార్నింగ్
19 hours ago

ఫ్లిప్ కార్ట్ సూపర్ కాయిన్స్ ను ఇకపై అలా కూడా వాడుకోవచ్చట..!
18-01-2021

ఫేస్బుక్, ట్విట్టర్‌కు పార్లమెంటరీ ప్యానెల్ పిలుపు
18-01-2021

వాట్సాప్ యూటర్న్.. మే 15 వరకు కొత్త ప్రైవసీ విధానం లేదు
17-01-2021

వాట్సాప్.. వెనకడుగు వేయకతప్పలేదు
17-01-2021

వాట్సాప్ గోప్యత మార్పుతో సిగ్నల్, టెలిగ్రాం పంట పండినట్లే
15-01-2021

ఎయిర్ పోడ్స్ ఛార్జింగ్ కోసం సరికొత్త మొబైల్ కేస్ ను తీసుకుని రానున్న యాపిల్
14-01-2021

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా 21 బెస్ట్ యాప్‌లు
13-01-2021

యూట్యూబ్ నుంచి కూడా ట్రంప్ ఔట్
13-01-2021

ప్రాణం పోవడానికి కారణం అయిన గూగుల్ మ్యాప్స్..?
13-01-2021
ఇంకా