newssting
BITING NEWS :
*బాలీవుడ్ లో కరోనా కలకలం.. బిగ్ బి ఫ్యామిలీలో అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యకు కరోనా పాజిటివ్ *దేశంలో భారీగా నమోదవుతున్న కేసులు.. 7,60,761, మరణాలు 21,018, రికవరీ అయినవారు 4,69,325 *బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజస్థాన్‌‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ భేటీ *ఇవాళ జైపూర్ లో రాజస్థాన్‌ సీఎల్పీ సమావేశం..సీఎం అశోక్‌ గెహ్లాత్‌ నివాసంలో భేటీకానున్న శాసనసభాపక్షం*తెలంగాణ: నేటి నుంచి అమల్లోకి ఈ-పాస్‌ విధానం....అధికారిక లావాదేవీలు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం *కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి..తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం *మహబూబ్‌నగర్‌ లో మంత్రి కేటీఆర్‌ పర్యటన.డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రారంభించనున్న కేటీఆర్‌ *సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల్లో రంగం కార్యక్రమం..భవిష్యవాణి వినిపించనున్న స్వర్ణలత * నేటి నుంచి మూతపడనున్న గుంటూరు మిర్చియార్డు.. ఈనెల 19వరకు మిర్చియార్డు మూసివేత *ఏపీలో మరో 1914 కరోనా పాజిటివ్‌ కేసులు.. మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 29,168

చైనాకు ధీటైన సమాధానం.. ఆ యాప్‌‌లపై నిషేధం?

17-06-202017-06-2020 19:18:24 IST
Updated On 18-06-2020 18:54:58 ISTUpdated On 18-06-20202020-06-17T13:48:24.094Z17-06-2020 2020-06-17T13:48:13.246Z - 2020-06-18T13:24:58.629Z - 18-06-2020

చైనాకు ధీటైన సమాధానం.. ఆ యాప్‌‌లపై నిషేధం?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇండో-చైనా సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేయాలని దేశమంతా డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దులతో పాటు దేశంలో హవా కొనసాగిస్తున్న విదేశీ యాప్ లపై నిఘా పెంచాలని కేంద్రానికి ఇంటెలిజెన్స్ అధికారులు సూచించారు. దేశంలో చైనాకు చెందిన 52 మొబైల్ అప్లికేష‌న్ల‌ు పనిచేస్తున్నాయి, వీటిపై నిషేధం విధించాల‌ని లేదా ప్ర‌జ‌లు వాటిని వాడ‌కుండా చూడాల‌ని నిఘా వర్గాలు బుధ‌వారం కేంద్రానికి సిఫార‌సు చేసినట్టు తెలుస్తోంది. 

ఈ మొబైల్ అప్లికేషన్లు, సోషల్ మీడియా యాప్ ల దేశ గోప్యతకు భంగం కలిగించేలా వున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో చైనాకు అవకాశం ఇవ్వకుండా భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.  చైనాతో లింక్ ఉన్న యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగించ‌డం ద్వారా మన విలువైన డేటా చోరీకి గురయ్యే అవ‌కాశం ఉంద‌ని నిఘా విభాగం అధికారులు తెలిపారు. భ‌ద్ర‌తా సంస్థ‌కు చెందిన సిబ్బంది ఎవ‌రూ వీటిని వినియోగించ‌రాద‌ని సూచించారు. జూమ్, టిక్‌టాక్, యూసీ బ్రౌజ‌ర్, జెండ‌ర్, షేర్ఇట్, క్లీన్ మాస్ట‌ర్ స‌హా 52 ఇత‌ర మొబైల్ అప్లికేష‌న్ల ద్వారా డేటా త‌స్క‌ర‌ణ‌కు గుర‌వుతుంద‌ని  ఓ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి నిఘా విభాగం స‌మ‌ర్పించింది. 

ఈ నివేదిక‌పై ఇప్ప‌టికే జాతీయ భద్రతా మండలి చర్చించింది. త్వరలో దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని, చైనా వస్తువులను బహిష్కరించాలని డిమాండ్లు పెరుగుతున్నాయని కేంద్రం తెలిసింది.  ఈమధ్యకాలంలో ప్రాచుర్యం పొందింది. జూమ్‌ వీడియో కాలింగ్ యాప్  ద్వారా వినియోగ‌దారుల గోప్య‌త‌కు ముప్పు ఉంద‌ంటున్నారు. రక్షణ రంగ, ప్ర‌భుత్వ స‌మావేశాలకు ఈ యాప్‌ని వినియోగించ‌రాదని కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే.

జూమ్ యాప్ వాడ‌కంపై ప‌లు దేశాలు ఇప్ప‌టికే ఆంక్షలు విధించాయి. జ‌ర్మనీలో ఈ యాప్‌పై ఆంక్షలు విధించింది.  అటు తైవాన్‌లో పూర్తిగా జూమ్ వాడ‌డం లేదు. అమెరికా కూడా సెనేట్ సభ్యులను జూమ్ యాప్ కాకుండా ఇత‌ర సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ యాప్‌ల‌ను ఉప‌యోగించాల‌ని పేర్కొంది.  పెద్ద ఎత్తున ఈ యాప్‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌టంతో యూజ‌ర్ల‌కు కొత్త వెర్ష‌న్‌ను అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. టిక్ టాక్ పైన కూడా నిషేధం విధించే ఆలోచనలో వుంది కేంద్రం. చైనా సంస్థలపై వత్తిడి తెచ్చేందుకు ఈ నిషేధం విధించాలని, దేశంలో కోట్లాదిమంది యూజర్లను దూరం చేయడం ద్వారా ఆర్థికంగా ఈ యాప్ ల మనుగడ కష్టం అవుతుందని భావిస్తున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle