newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చేయి కలిపితే ఒప్పుకోనంటున్న స్మార్ట్ వాచ్.. విద్యార్థిని ఆవిష్కరణ

14-04-202014-04-2020 14:45:15 IST
Updated On 14-04-2020 15:00:36 ISTUpdated On 14-04-20202020-04-14T09:15:15.375Z14-04-2020 2020-04-14T09:15:13.194Z - 2020-04-14T09:30:36.618Z - 14-04-2020

చేయి కలిపితే ఒప్పుకోనంటున్న స్మార్ట్ వాచ్.. విద్యార్థిని ఆవిష్కరణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నెలరోజులుగా కరోనా వైరస్ గురించిన  వార్తలు, భయాల ముట్టడిలో చిక్కుకున్న దేశ ప్రజలు చేయీ చేయీ కలిపి పరామర్సించుకోవడం దాదాపుగా మానుకున్నారు. కానీ అలవాటులో పొరపాటుగా కొత్త వ్యక్తి కలిస్తే లేక పనిచేస్తున్న ఆఫీసుల్లో సహోద్యోగులు కనబడితే వెంటనే చేయి ముందుకొచ్చి హాయ్ అంటూ ఎదురుగా ఉంటున్న వ్యక్తిని పట్టుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించడం ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటోంది. 

చేతులు కలపకుండా ఉండటం ఎలాగో అంత పెద్ద అమెరికా అధ్యక్షుడికో సాధ్యం కావడం లేదు. పైగా ప్రతి మనిషి పగటిపూట కనీసం 80 సార్లు చేతులతో ముఖాన్ని, కళ్లను, ముక్కును తాకుతుంటారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. చేయి కలపడం, చేతులతో ముఖం పట్టుకోవడం మానుకోవడం మహా కష్టమైపోతున్న ఈ రోజుల్లో అలా కట్టుతప్పినప్పుడల్లా మనల్ని హెచ్చరిస్తూ ఆ పనిచేయవద్దని చెప్పే యంత్రుడు మన వద్ద ఉంటే ఎంత బాగుంటుందో కదా.. 

సరిగ్గా ఆ పనే చేసింది సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎలక్ట్రానిక్స్ విద్యార్థిని. మనం ఆదమరిస్తే అప్రమత్తం చేసేలా ఓ సెన్సర్‌ స్మార్ట్‌ వాచ్‌ను రూపొందించింది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థిని. కరోనా వైరస్‌ కట్టడి కోసం కరచాలనం చేయొద్దని, చేతితో కళ్లను, నోటిని, ముక్కును ముట్టుకోవద్దని వైద్యులు చెపుతున్న విషయం తెలిసిందే. అయితే అలవాటులో పొరపాటులా చెయ్యి ముఖాన్ని తాకుతూనే ఉంటుంది. 

Hewitt Health Watch with Heart Censor Smartwatch (Black Strap ...

ఇలాంటి అలవాటును దూరం చేసే లక్ష్యంతో సెన్సర్‌ స్మార్ట్‌ వాచ్‌ను తయారు చేసింది బుధవారపు స్నేహ. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చదువుతున్న స్నేహ.. ఓ వాచ్‌ను రూపొందించి, దానికి సెన్సర్‌ డివైస్‌ను ఏర్పాటు చేసింది. 

మనం కరచాలనం చేయబోయినా.. ముక్కు, నోరు, కళ్లను తాకబోయినా వెంటనే ఆ సెన్సర్‌ గుర్తించి శబ్దం చేస్తుంది. దీంతో వెంటనే అప్రమత్తమై ఆ ప్రయత్నాన్ని విరమించుకునేలా స్మార్ట్‌ వాచ్‌ హెచ్చరిస్తుంది. తన తండ్రి ప్రోత్సాహంతో ఈ స్మార్ట్‌ వాచ్‌ను తయారు చేసినట్లు స్నేహ తెలిపింది. స్నేహ కృషిని జిల్లా అధికారులు సోమవారం అభినందించారు.

మనం రోజులో ఎన్ని కిలోమీటర్లు నడిచామో, మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటోందో కూడా చెప్పే స్మార్ట్ ఫోన్లు ఉన్న ప్రస్తుత కాలంలో మనల్ని ఫలానా పనులు చేయవద్దు అని హెచ్చరించే స్మార్ట్ ఫోన్ కూడా మన వద్ద ఉంటే బాగుండుననే ఆలోచనకు రూపమిచ్చిన స్నేహకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించాలి.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle