newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

చేతిలో ఫోను.. చెవిలో ఫోను.. తెగ కొనేస్తున్నారు... !

25-02-201925-02-2019 13:11:48 IST
2019-02-25T07:41:48.018Z25-02-2019 2019-02-25T07:41:44.005Z - - 12-04-2021

చేతిలో ఫోను.. చెవిలో ఫోను.. తెగ కొనేస్తున్నారు... !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చేతిలో ఫోను..చెవిలో ఇయర్ ఫోను. ఇలా మన దేశంలో జనాలకు ఫోన్ల పిచ్చి పట్టుకుంది. అదీ స్మార్ట్ ఫోన్ల పిచ్చి ! గత ఏడాది లెక్క తీస్తే  మనోళ్లు ఏకంగా 28. 5 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ ఫోన్లు కొనిపారేసారు. మన రూపాయల్లో లెక్క పెడితే 2.5 కోట్ల రూపాయల పైమాటే.  ఎడాపెడా కొనేసిన ఈ ఫోన్ల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా 16 .1 కోట్లు అన్నమాట..అన్నమాటేంటి ..ఉన్న మాటే ! 

ప్రపంచవ్యాప్తంగా 522 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లు అమ్ముడుపోతే అందులో సగం వాటా ఆసియా దేశాలది. మొదటి స్థానం చైనా ఆక్రమిస్తే ఇక రెండోది భారత్! మన ఫోన్ల అమ్మకాల విలువ గత సంవత్సరం 19 శాతం పెరిగితే... సంఖ్యాపరంగా 22 శాతం పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. 

స్మార్ట్ ఫోన్ల మార్కెట్ పెరగడానికి కొంతకాలం నుంచి జియో వంటి సంస్థలు ఇతర సర్వీస్ ప్రొవైడర్లు పోటీలుపడి డేటా ధరల్ని తగ్గించడం ఒక ప్రధాన కారణం. ఇక ఈ  ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు ఓటర్లకు ఫోన్లను కొనిపెట్టే పనులు చేస్తున్నాయి, ఆంధ్రా ద్వాక్రా మహిళలకు భారీ సంఖ్యలో ఫోన్లను ఉచితంగాపంపిణీ చేస్తున్న ఉదాహరణలు మన ముందే ఉన్నాయి.

మరోవైపు రానున్న మూడేళ్ళలో స్మార్ట్ ఫీచర్ ఫోన్ మార్కెట్ 28 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఒక నివేదిక వెల్లడించింది. 300 మిలియన్ స్మార్ట్ ఫీచర్ ఫోన్లు 2021కు మొబైల్ మార్కెట్లోకి రానున్నాయని రీసెర్చ్ నివేదికలో తెలిపారు. భారతీయుల్లో సగటున ప్రతి వ్యక్తి ఒక ఫీచర్ ఫోన్, స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. మనదేశంలో జనాభాకంటే ఫోన్లే ఎక్కువంటే ఆశ్చర్యం వేయకమానదు. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle