చిచ్చు పెడుతున్న టిక్ టాక్..!
28-07-201928-07-2019 08:50:33 IST
2019-07-28T03:20:33.704Z28-07-2019 2019-07-28T03:20:30.065Z - - 14-04-2021

టిక్ టాక్. ఇప్పుడు ఈ పేరు తెలియని స్మార్ట్ ఫోన్ వినియోగదారుడు లేరు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదరణ పొందిన ఈ చైనాకు చెందిన యాప్ ఇప్పుడు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. వయస్సుతో బేధం లేకుండా అంతా టిక్ టాక్ మాయలో పడిపోతున్నారు. దీంతో ఇప్పుడు ఇది ఒక వ్యసనంలా మారి జీవితాల్లోనూ చిచ్చు పెడుతోంది. ఉద్యోగాలు ఊడగొడుతోంది. కేరీర్‌ను బుగ్గి చేస్తోంది. హత్యలకు, మరణాలకు కారణమవుతోంది.
గత ఆరేడు నెలల నుంచి టిక్ టాక్ ప్రభావం బాగా పెరిగిపోయింది. మెజారిటీ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ యాప్‌ను వాడుతున్నారు. అయితే, కాలక్షేపంగా ఉండాల్సిన టిక్ టాక్ ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు ఉదాహరణ. వారం క్రితం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ఔట్సోర్సింగ్ పని మానేసి టిక్ టాక్ చేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో 11 మందిని అధికారులు సస్పెండ్ చేశారు.
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మనువడు, మరో స్నేహితుడు కలిసి పోలీస్ వాహనంపై కూర్చొని పోలీసులకే వార్నింగ్ ఇస్తూ టిక్ టాక్ చేయడం కూడా వివాదం రాజేసింది. ఈ వ్యవహారంలో స్వయానా హోంమంత్రి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, గుజరాత్లో ఓ కానిస్టేబుల్ ఏకంగా పోలీస్ స్టేషన్లోనే టిక్ టాక్ చేయడం, ఆ వీడియోలు వైరల్ కావడంతో ఆమె ఉద్యోగం ఊడింది.
తాజాగా, గాంధీ హాస్పటల్లోని ఫిజియోథెరఫి విభాగంలోనూ ఈ భాగొతం బయటకు వచ్చింది. ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థులు గాంధీ ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ చేస్తూ.. ఆసుపత్రిలోనే టిక్ టాక్ వీడియోలు చేశారు. దీంతో అధికారులు వారి ఇంటర్న్‌షిప్‌ను రద్దు చేయడంతో వారి కెరీర్‌కు తీవ్ర నష్టం జరిగింది. ఇంకా, అనేక ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులు ఇలా టిక్ టాక్ వ్యసనం బారిన పడి పనివేళల్లో వీడియోలు చేస్తూ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు.
టిక్ టాక్ హత్యలు, దారుణాలకు కూడా కారణమవుతోంది. టిక్ టాక్ చేయవద్దని భర్త మందలించినందుకు భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన, ఓ హత్య జరిగిన సంఘటన ఇటీవల తమిళనాడులో వెలుగు చూసింది. అన్ని వయస్సుల మహిళలు, పురుషులు టిక్ టాక్ ఉచ్చులో పడుతుండటం కాపురాల్లో కూడా చిచ్చు పెడుతోంది. దంపతుల్లో ఒకరికి టిక్ టాక్ చేసే అలవాటు ఉండి, మరొకరికి ఇష్టం లేకపోతే గొడవలకు సైతం దారితీస్తోంది. ఇక, అందరినీ ఆకట్టుకునేలా వీడియోలు తీయాలనే తపనతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్న సంఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా, మేడ్చల్ జిల్లాలో టిక్‌టాక్ కోసం వీడియో తీస్తూ యువకుడు నీటమునిగిన సంగతి తెలిసిందే.
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు టిక్ టాక్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ప్రేమ పేరుతో సదరు మహిళను మోసం చేసిన యువకుడు తర్వాత తప్పించుకున్నాడు. మోసం గుర్తించిన మహిళ లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, టిక్ టాక్ గొడవలకు కూడా కారణమవుతోంది. ఈ యాప్ వేదికగా గ్రూపులుగా ఏర్పాడి ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడం సైతం కామన్ గా మారింది. దీంతో మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతున్నారు. ఇలా ఒక యాప్ తెలియకుండానే వ్యసనంలా మారి ఎంతో మంది జీవితాల్లో చిచ్చు పెడుతోంది. కాబట్టి, టిక్ టాక్ వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మేలు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా