newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

చవకైన మడత ఫోన్‌ వస్తోంది... మనకి తీసుకొస్తారా?

05-12-201905-12-2019 11:08:34 IST
2019-12-05T05:38:34.875Z05-12-2019 2019-12-05T05:38:31.357Z - - 11-08-2020

చవకైన మడత ఫోన్‌ వస్తోంది... మనకి తీసుకొస్తారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొబైల్‌ మార్కెట్‌లో ఈ ఏడాది ట్రెండింగ్‌ టాపిక్‌ ఫోల్డబుల్‌ ఫోన్‌. శాంసంగ్‌, హువావే, మోటొరోలా ఇప్పటికే ఫోల్డబుల్‌ ఫోన్స్‌ను తీసుకొచ్చాయి. వీటికి ఆదరణ కూడా బాగుందని మొబైల్‌ మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీటి ధర మాత్రం లకారాన్ని దాటిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సంస్థ తక్కువ ధరకే మేలైన ఫోల్డబుల్‌ ఫోన్‌ ఇస్తామని చెబుతోంది. మరి దాని సంగతి చూద్దామా. 

రాబర్టో ఎస్కోబార్‌ అనే వ్యక్తి కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ను తీసుకొస్తామని చెబుతున్నాడు. దీనికి ఎస్కోబార్‌ 1 అని పేరు పెట్టాడు. రాయల్‌ ఫ్లెక్స్‌ పై డిజైన్‌ను స్ఫూర్తితో ఎస్కో బార్‌ 1ను రూపొందించారు. శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్‌ కంటే ఇది మరింత కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల ఫ్లేమ్‌ త్రోయర్‌ (మంటల్ని విరజిమ్మే గన్‌)ను తయారు చేసిన పబ్‌లో ఎస్కోబార్‌ అనే డ్రగ్‌ లార్డ్‌ సోదరుడే రాబర్టో.  

Image result for roberto escobar ready to launch foldable phone

ఎస్కోబార్‌ 1 ఫోల్డబుల్‌ను రాబర్టో శాంసంగ్‌ ఫోల్డ్‌కి పోటీగా తీసుకురావడం లేదట. ఆయన గురి ఏకంగా ఆపిల్‌ మీదే ఉందని చెబుతున్నాడు. ఈ మొబైల్‌ను లిమిటెడ్‌ వెర్షన్‌గా తీసుకొస్తున్నారు. లక్ష యూనిట్లు మాత్రమే తయారు చేస్తారని తెలుస్తోంది. దీనిని రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొస్తారు. 128 జీబీ స్టోరేజీ డివైజ్‌ ధర 349 డాలర్లు.

మన కరెన్సీలో సుమారు రూ.25,100. ఇక 512 జీబీ వేరియంట్‌ అయితే 499 డాలర్లు. ఇండియన్‌ కరెన్సీలో రూ.35,800.  ఎస్కోబార్‌ వెబ్‌సైట్‌లోనే వీటి అమ్మకాలు ఉంటాయి. నెట్‌వర్క్‌, రిటైలర్స్‌ లేకుండా అమ్మకాలు నిర్వహించడం వల్ల తక్కువ ధరకు ఇవ్వగలుగుతున్నామని రాబర్టో చెబుతున్నాడు. 

ఎస్కోబార్‌ 1లో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 6 జీబీ లేదా 8 జీబీ ర్యామ్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ పై ఆధారంగా పని చేస్తుంది. మెమొరీ కార్డు ద్వారా 256 జీబీ వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఇందులో 7.8 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఫోల్డబుల్‌ ఆమోలెడ్‌ స్క్రీన్‌ ఉంటుంది. ఇందులో 16 ఎంపీ, 20 ఎంపీ కెమెరాలు ఉంటాయి. 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 25 వాట్‌ ఫాస్‌ ఛార్జింగ్‌కు ఇది సపోర్టు చేస్తుంది. ఈ మొబైల్‌ బరువు 320 గ్రాములు ఉంటుంది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle