newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

గోజీరో మొబిలిటీ బైక్.. కాలుష్యం జీరో

14-05-201914-05-2019 14:51:32 IST
2019-05-14T09:21:32.104Z14-05-2019 2019-05-14T09:21:28.485Z - - 21-08-2019

గోజీరో మొబిలిటీ బైక్.. కాలుష్యం జీరో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పర్యావరణ పరిరక్షణ కోసం అనేక కంపెనీలు ఎకో ఫ్రెండ్లీ బైక్ లు, కార్లు విడుదలచేస్తున్నాయి. అవి వినియోగదారుల ఆదరణ కూడా చూరగొంటున్నాయి. బ్రిటిష్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ ‘గోజీరో మొబిలిటీ’ భారత్‌లోకి అడుగుపెట్టింది.  మైల్‌, వన్‌ పేర్లతో రెండు విద్యుత్‌ బైక్‌లను ఢిల్లీ మార్కెట్లోకి విడుదల చేసింది. మైల్‌ ధర రూ.29,999 కాగా, వన్‌ ధర రూ.32,999గా నిర్ణయించారు. గోజీరో వన్‌ బైక్‌లో 400 వాట్‌అవర్‌(డబ్ల్యూహెచ్‌) లిథియమ్‌ బ్యాటరీని అమర్చారు. ఈ బైక్ బ్యాటరీని ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే, 60 కిమీ.దూరం ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. ఖర్చు కూడా తక్కువే అంటోంది కంపెనీ. 

గోజీరో మైల్‌ బైక్‌ను 300 వాట్‌అవర్‌ లిథియమ్‌ బ్యాటరీతో రూపొందించామని, ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 45 కిమీ. దూరం ప్రయాణించవచ్చని వివరించారు. ఈ రెండు బైక్‌లతో జాకెట్లు, బెల్ట్‌లు, వాలెట్స్‌ వంటి లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులను కూడా భారత మార్కెట్లోకి విడుదల చేస్తామని పేర్కొన్నారు. కోల్‌కతాకు చెందిన కీర్తి సోలార్‌ కంపెనీతో గోజీరో మోబిలిటీ ఒప్పందం కుదుర్చుకుంది.

విద్యుత్‌తో నడిచే వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించడం సంతోషంగా ఉందని తెలిపారు. తొలి ఏడాది 3000 మోటారు సైకిళ్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ.. వచ్చే ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని 75 వేలకు పెంచనుంది. ఇప్పటికే తమ కంపెనీలో కీర్తి సోలార్‌ కంపెనీ 2,50,000 డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఈ బైక్‌లపై వారంటీ కూడా అందిస్తోంది ఈ కంపెనీ. మూడేళ్ల పాటు 30వేల కిలోమీటర్లు మైలేజ్ వారంటీ ఉంది. ఈ బైక్‌లు వాడడం వల్ల కాలుష్యం బాగా తగ్గుతుందన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle