గూగుల్, యాపిల్ ప్లే స్టోర్‌లో టిక్‌టాక్ దొరకదు
17-04-201917-04-2019 12:51:13 IST
Updated On 17-04-2019 16:26:36 ISTUpdated On 17-04-20192019-04-17T07:21:13.550Z17-04-2019 2019-04-17T07:20:10.702Z - 2019-04-17T10:56:36.576Z - 17-04-2019

ప్లేస్టోర్ నుంచి టిక్ టాక్ యాప్ తొలగించాలని ఆదేశాలు రావడంతో గూగుల్ సంస్థ వెంటనే చర్యలకు దిగింది. ఇండియాలో ఎంతో పాపులర్ అయిన టిక్ టాక్ యాప్ యాక్సెస్‌ను బ్లాక్ చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. డౌన్ లోడ్లను నిషేధించామని, మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని గూగుల్ వెల్లడించింది. ఆపిల్ సంస్థ కూడా గూగుల్ బాటలో నడిచింది. ప్లేస్టోర్‌లో ఇక టిక్ టాక్ యాప్ దొరకదని రెండు సంస్థలు పేర్కొన్నాయి.
ఈ యాప్ పోర్నోగ్రఫీని ప్రోత్సహిస్తోందని, చిన్నారుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని ఆరోపణలు వచ్చాయి. టిక్ టాక్ యాప్ అందిస్తున్న చైనా సంస్థ బైటెండెన్స్ టెక్నాలజీ రివ్యూ పిటిషన్ వేసింది. ఈ నెల 3వ తేదీన టిక్ టాక్‌ను నిషేధించాలన్న ఉత్తర్వులు వెలువడగా, భారత్ వంటి పెద్ద మార్కెట్‌ను వదులుకునేందుకు సిద్ధంగా లేని బైటెండెన్స్, తన వంతు ప్రయత్నాలు చేసి విఫలమైంది. సుప్రీంకోర్టును సంస్థ ప్రతినిధులు ఆశ్రయించగా, కేసును మద్రాస్ హైకోర్టుకే బదిలీ చేస్తూ అత్యున్నత ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
యాప్‌ను నిషేధించడం ఇండియాలో వాక్ స్వాతంత్రానికి విఘాతమని బైటెండెన్స్ చేసిన వాదనతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. ఇక గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్‌ను తొలగించామని గూగుల్ ప్రకటించగా, యాపిల్ మాత్రం ఇంకా స్పందించలేదు. టిక్ టాక్ యాప్‌ను ప్లేస్టోర్ల నుంచి తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్, యాపిల్ సంస్థలను మంగళవారం ఆదేశించిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021
ఇంకా