గూగుల్ యాడ్స్‌లో టాప్ ఎవరంటే...?
04-04-201904-04-2019 15:48:13 IST
2019-04-04T10:18:13.296Z04-04-2019 2019-04-04T10:18:11.057Z - - 11-04-2021

లోక్ సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా హీటెక్కిస్తున్నాయి. బహిరంగ సభలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారంలో అభ్యర్థులు, నేతలు బిజీబిజీగా ఉన్నారు. వీటితో ఆగకుండా సోషల్‌మీడియా, ఇంటర్నెట్లోనూ ప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు గూగుల్లోనూ రాజకీయ ప్రకటనలు ఇస్తున్నారు. ఇందు కోసం ఆయా పార్టీలు భారీగానే ఖర్చు చేస్తున్నాయి. ఈసీ కఠిన ఆదేశాల నేపథ్యంలో దీనికి సంబంధించి గూగుల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ రూపొందించింది. ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటివరకు రాజకీయ ప్రకటనల కోసం పార్టీలు చేసిన ఖర్చు వివరాలను ఇందులో వివరించింది. ఫిబ్రవరి 19 నుంచి బీజేపీ 554 ప్రకటనలు గూగుల్‌లో పోస్టు చేయగా.. వీటి కోసం రూ. 1.21కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ తర్వాత ఏపీకి చెందిన వైఎస్సార్సీపీ 107 ప్రకటనల కోసం రూ. 1.04కోట్లు వెచ్చించింది. తెలుగుదేశం పార్టీ కోసం రెండు గ్రూప్‌లు గూగుల్‌లో ప్రకటనలు పోస్టు చేశాయి. టీడీపీ ప్రకటనల కోసం ప్రమణ్య స్ట్రాటజీ కన్సల్టింగ్ ప్రయివేటు లిమిటెడ్ రూ. 85.25లక్షలు, డిజిటాంట్ కన్సల్టింగ్ ప్రయివేటు లిమిటెడ్ రూ. 63.43లక్షలు ఖర్చు పెట్టింది. ఈ రెండు కంపెనీలు పెట్టిన మొత్తం ఖర్చు రూ. 1.48కోట్లుగా ఉంది. దీనిని బట్టి చూస్తే టీడీపీ ఖర్చే ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ గూగుల్ ప్రకటనల కోసం కేవలం రూ.54,100 మాత్రమే ఖర్చు చేసింది. ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటివరకు గూగుల్ ప్లాట్‌ఫామ్‌పై 831 రాజకీయ ప్రకటనలు రాగా.. వాటి మొత్తం ఖర్చు విలువ రూ. 3.76కోట్లుగా ఉంది. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రూప్‌లు రూ. 1.73కోట్లు ఖర్చు చేశాయి. తెలంగాణ నుంచి రూ.72లక్షలు వెచ్చించారు. గూగుల్ ప్రకటనల్లో బీజేపీ, టీడీపీ, వైసీపీ తమ సత్తా చాటుతున్నాయి.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
11 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా