గూగుల్ మీట్.. 49 మందితో మాట్లాడుకోవచ్చు
17-09-202017-09-2020 18:35:24 IST
2020-09-17T13:05:24.448Z17-09-2020 2020-09-17T12:05:40.723Z - - 15-04-2021

వర్క్ ఫ్రమ్ హోమ్ కాలంలో తమ సిబ్బందితో మాట్లాడాలి అనుకుంటే చాలా కష్టాలు పడాల్సి వస్తోంది కంపెనీ హెడ్ లకు..! ముఖ్యంగా గ్రూప్ మీటింగ్ విషయంలో కొన్ని యాప్స్ ను వాడుతూ వస్తున్నప్పటికీ.. చాలా పరిమితులు ఉంటున్నాయి. తాజాగా గూగుల్ మీట్ గొప్ప ఫీచర్ ను తీసుకుని వచ్చింది. ఏకంగా 49 మందితో ఒకే సారి చాట్ చేసే అవకాశం ఉంది. అంతేకాదు వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉన్న సమయంలో బ్యాగ్రౌండ్ ను బ్లర్ చేసే అవకాశం ఉందని జి సూట్ టీమ్ తెలిపింది. గూగుల్ మీట్ కు సంబంధించిన అప్డేట్స్ ను రాబోయే వారాల్లో రిలీజ్ చేయనున్నారు.
బ్యాగ్రౌండ్ బ్లర్ ఫీచర్ క్రోమ్ బ్రోజర్ లో తీసుకుని వచ్చారు. జీ సూట్ కస్టమర్స్ తో పాటూ గూగుల్ పర్సనల్ అకౌంట్స్ ఉన్న వాళ్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
49 మందితో ఒకటే సారి చాట్ చేసే అవకాశం ఉంది. ఆటో, టైల్డ్ లే ఔట్స్ లో భాగంగా గూగుల్ మీట్ ను ఉపయోగించి 49 మందితో వీడియో కాల్ మాట్లాడవచ్చు. మీట్ ఆన్ ది వెబ్ ఫీచర్ లో భాగంగానే ఇది అందుబాటులో ఉంటుందని గూగుల్ చెబుతోంది. డీఫాల్ట్ గా ఉన్న దాన్లో 9 టైల్స్ ఉండగా.. 16 వరకూ టైల్డ్ లే ఔట్స్ ఉండనున్నాయి. స్లైడర్ ను ఉపయోగించి టైల్స్ ను పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ ఫీచర్ డీఫాల్ట్ గా ఆఫ్ చేయవచ్చు. Settings > Change Layout ద్వారా మార్పులు చేసుకోవచ్చు.
వీడియో కాల్ మాట్లాడే సమయంలో కొన్ని కొన్ని సార్లు వెనుక వైపు బ్యాగ్రౌండ్ అంత బాగా ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో బ్యాక్ గ్రౌండ్ ను బ్లర్ చేసే అవకాశం ఉంది. ఎంతో మంది యూజర్లు బ్యాగ్రౌండ్ విషయంలో వచ్చిన మార్పులను స్వాగతిస్తూ ఉన్నారు. అలాగే నాయిస్-ఫ్రీ వీడియో కాల్ అనుభవం అన్నది యూజర్లకు అందనుంది. మ్యాక్, విండోస్ డివైజ్ లలోని క్రోమ్ బ్రౌజర్ లో ఈ ఫీచర్ ను వాడుకోవచ్చు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా