newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం అవుట్..!?

18-09-202018-09-2020 17:04:44 IST
2020-09-18T11:34:44.567Z18-09-2020 2020-09-18T11:34:41.357Z - - 22-04-2021

గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం అవుట్..!?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం యాప్ శుక్రవారం గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించలేదు. వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ యాజమాన్యంలోని యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో సెర్చ్‌ చేసినప్పుడు కనిపించలేదు. దీంతో పేటీఎం యూజర్లు తొలుత ఆందోళన చెందారు. కాసేపటికీ గూగుల్ పేటీఎం ను తొలగించినట్లు ప్రకటించింది. పేటీఎం గ్యాంబ్లింగ్ గైడ్ లైన్స్ ఉల్లంఘించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ ప్రతినిధులు పేర్కొన్నారు.

గూగుల్ పాలసీలను పేటీఎం పదే పదే ఉల్లంఘించినట్లు కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆన్ లైన్ గేమ్స్ ఆడేందుకు పేటీఎం అనుమతిస్తోందని, స్పోర్ట్స్ బెట్టింగులకు కూడా ఇది సహకరిస్తుండటం వల్లే యాప్ ను తొలగించినట్లు గూగుల్ తెలిపింది.

యాపిల్ యాప్ స్టోర్ లో మాత్రం పేటీఎం అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రం గూగుల్ ప్లే స్టోర్ లో పేటీఎం కు చెందిన ఇతర యాప్ లు మాత్రం అందుబాటులో ఉంటాయి. పేటీఎం ఫర్ బిజినెస్, పేటీఎం మనీ, పేటీఎం మాల్ ఇలా అన్నీ అందుబాటులో ఉంచింది గూగుల్.

పేటీఎం యాప్ ను తొలగించడంతో అందులో దాచుకున్న తమ నగదు ఏమైపోయిందోనని యూజర్లు ఆందోళనకు గురయ్యారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ ను తొలగించడంపై సదరు యాజమాన్యం ట్విట్టర్ వేదికగా స్పందించింది. తాత్కాలికంగా పేటీఎం యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించబడిందని, కొత్త డౌన్ లోడ్లు, అప్ డేట్ ల కోసం మరి కొంతకాలం పడుతుందని పేటీఎం యాజమాన్యం తెలిపింది. పేటీఎం యూజర్ల మనీ మాత్రం చాలా సేఫ్ గా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది పేటీఎం. ఆల్రెడీ ఇన్ స్టాల్ చేసుకున్న యూజర్లు ఎప్పటి లాగే తమ పేటీఎం అకౌంట్లను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఇప్పటి వరకూ పేటీఎం ను 5 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

పేటీఎం వచ్చిన కొత్తలో కేవలం ఆన్ లైన్ పేమెంట్స్, మొబైల్ లేదా డిష్ రీఛార్జ్ లు, బస్ - రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు పేటీఎంను ఎక్కువగా ఉపయోగించేవారు యూజర్లు. నిదానంగా పేటీఎం తన సేవలను పెంచుతూ వచ్చింది. పేటీఎంలోనే ఆన్ లైన్ షాపింగ్, ఫుడ్ ఆర్డర్లు చేసుకునే సదుపాయాల్ని కూడా అప్ డేట్ చేసింది. 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   5 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle