గూగుల్ పే పై నిషేధమా? ఎన్ పిసీఐ వివరణ
27-06-202027-06-2020 13:49:21 IST
Updated On 27-06-2020 13:49:15 ISTUpdated On 27-06-20202020-06-27T08:19:21.672Z27-06-2020 2020-06-27T08:18:53.493Z - 2020-06-27T08:19:15.374Z - 27-06-2020

నోట్ల రద్దు అనంతరం దేశంలో డిజిటల్ లావాదేవీలు బాగా పెరిగాయి. కేంద్రం కూడా ఈ-లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా గూగుల్ పే పై రిజర్బుబ్యాంక్ నిషేధం విధించిందని వార్తలు వస్తున్నాయి. అయితే, భారత్‌లో గూగుల్ పే యాప్‌ను ఆర్బీఐ బ్యాన్ చేసిందంటూ సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న పుకార్లపై నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. గూగుల్ పే యాప్‌ను ఇండియాలో బ్యాన్ చేయలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. గూగుల్ పే లావాదేవీలపై వచ్చిన పుకార్లపై సంస్థ స్పష్టత నిచ్చింది. గూగుల్ పే యాప్ చట్టపరిధిలోనే ఉండి పని చేస్తుందని, తాము అన్ని నిబంధనలను పాటిస్తున్నామని సంస్థ వివరణ ఇచ్చింది. తమ యాప్ యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుందని పేర్కొంది. గూగుల్ పే ద్వారా జరిగే ప్రతీ లావాదేవి పూర్తిగా సురక్షితమేనని వెల్లడించింది. గూగుల్ పే థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ మాత్రమేనని, ఇది ఎలాంటి పేమెంట్ వ్యవస్థను నిర్వహించదని ఆర్బీఐ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ ప్రచురించిన అథీకృత చెల్లింపు వ్యవస్థల ఆపరేటర్ల జాబితాలో గూగుల్ పే లేదని ఆర్ బీఐ తెలిపింది. గూగుల్ పే కార్యకలాపాలు చెల్లింపులు పరిష్కారాల చట్టం 2007ను ఉల్లంఘించడం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలన్‌లతో కూడిన బెంచ్‌కు ఆర్బీఐ నివేదించింది. గూగుల్ పే విషయంలో వచ్చిన వార్తల నిరాధారమయినవి అని, ఖాతాదారులు సురక్షితమయిన చెల్లింపులు చేసుకోవచ్చని గూగుల్ పే వివరించింది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా