newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గూగుల్ కొత్త గ్యాడ్జెట్స్ తీసుకొచ్చింది... ఇవే అవి

16-10-201916-10-2019 11:54:01 IST
Updated On 16-10-2019 13:06:58 ISTUpdated On 16-10-20192019-10-16T06:24:01.934Z16-10-2019 2019-10-16T06:24:00.201Z - 2019-10-16T07:36:58.173Z - 16-10-2019

గూగుల్ కొత్త గ్యాడ్జెట్స్ తీసుకొచ్చింది... ఇవే అవి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ్యాడ్జెట్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన పిక్సల్‌ 4, పిక్సల్‌ 4 ఎక్స్‌ఎల్‌ మొబైల్స్ లాంచ్ అయ్యాయి. ‘మేడ్‌ బై గూగుల్‌' 19’ పేరుతో న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గూగుల్ టీమ్ వీటిని ఆవిష్కరించింది. వీటితోపాటు  పిక్సల్‌ బుక్‌ గో, పిక్సల్‌ బడ్స్‌ను కూడా లాంచ్ చేసింది. గత కొన్ని రోజులుగా టెక్ నిపుణులు చెబుతున్నట్లుగా ఈ మొబైల్స్ ఫీచర్లు ఉన్నాయి.

అయితే ఈ ఫోన్లు భారత్‌లో విడుదల చేయడం లేదని గూగుల్‌ ప్రకటించింది. ఈ మోడల్‌లో వాడుతున్న మోషన్‌ సెన్స్‌కు ఉపయోగపడే సొలి రాడ్‌ చిప్‌... 60 గిగాహెర్ట్స్‌ స్పెక్ట్రమ్‌పై పని చేస్తుంది. భారత్‌లో ఈ స్పెక్ట్రమ్ కు అనుమతి లేదు. దీంతో మనకు ఈ ఫోన్లు రావు. అయితే ఈ సాంకేతికత లేకుండా పిక్సల్ 4 సిరీస్ ఫోన్లు తీసుకొస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.  

గూగుల్‌ పిక్సల్‌ 4, ఎక్స్‌ఎల్‌ ఫీచర్లు...

పిక్సల్‌ 4 ఎక్స్‌ఎల్‌లో 6.3 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. పిక్సల్ ‌4కు 5.7 అంగుళాల డిస్ ప్లే ఇస్తున్నారు. వీటిలో స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌ ఉంటుంది. 6 జీబీ ర్యామ్‌తో మొబైల్  ప్రారంభమవుతుంది. 16 ఎంపీ ప్రైమరీ కెమెరాతో తీసుకొస్తున్నారు. దీంతోపాటు 12 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు కూడా ఇస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో మొబైల్ పని చేస్తుంది.  పిక్సల్‌ 4లో 2,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.  పిక్సల్‌ 4 ఎక్స్‌ఎల్‌లో 3,700 ఎంఏహెచ్‌  బ్యాటరీ తీసుకొస్తున్నారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (ఏఐ) ఫీచర్లతో పిక్సల్‌ 4, పిక్సల్ 4  ఎక్స్‌ఎల్‌ ఫోన్లను రూపొందించారు. సంజ్ఞలు ద్వారా ఫోన్ ను ఆపరేట్ చేసేలా మోషన్‌ సెన్సర్‌ ఉంటుంది.  దీంతోపాటు ఇందులో రాడార్‌ సెన్సార్‌ కూడా ఉంటుంది. డేటా భద్రత కోసం ‘టైటాన్‌ ఎం’ సెక్యూరిటీ చిప్‌ను అమర్చారు. నలుపు, తెలుపు, నారింజ రంగుల్లో ఈ ఫోన్లు లభిస్తాయి. పిక్సల్ 4 ధర సుమారు 799 డాలర్లు (మన దేశంలో సుమారు రూ.57 వేలు).  పిక్సల్‌ 4 ఎక్స్‌ఎల్‌ ధర 899 డాలర్లు (మన దేశంలో సుమారు రూ. 64 వేలు). ఈ మొబైళ్లక మూడేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని గూగుల్ చెబుతోంది. అమెరికాలో బుకింగ్‌ లు ప్రారంభమయ్యాయి.  ఈ నెల  24 నుంచి షిప్పింగ్‌ ప్రారంభిస్తారు. 

పిక్సల్‌ బుక్‌ గో ఇలా ఉంటుంది... 

తక్కువ ధరలో గూగుల్‌ తొలిసారి ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. ఇందులో 13.3 అంగుళాల టచ్ డిస్ ప్లే ఉంటుంది. దీని ధర 649 డాలర్ల నుంచి 1,399 డాలర్ల వరకు ఉంటుంది. పిక్సల్ బుక్ గోలో  ఎనిమిదో జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్‌ ఉంటుంది.  8 జీబీ ర్యామ్్ /16 జీబీ ర్యామ్‌ వెర్షన్లు తీసుకొస్తున్నారు.  64 జీబీ/126జీబీ/256జీబీ హార్డ్ డిస్క్ కెపాసిటీ లో ఈ ల్యాపీలు వస్తున్నాయి. పిక్సల్ బుక్ గో స్క్రీన్ 0.5 అంగుళాల మందం ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 12 గంటల పాటు వాడుకోవచ్చు. 

పిక్సల్‌ బడ్స్‌ లెక్క ఇది... 

నాజూకు డిజైన్‌తో పిక్సల్‌ బడ్స్‌ ను గూగుల్ లాంచ్ చేసింది.  ఇందులో బ్లూటూత్‌ 5.0 చిప్‌ను  వాడారు. ఫోన్‌కు ఇయర్‌ బడ్స్‌కు మధ్యలో మూడు గదులు ఉన్నా బ్లూటూత్‌ కనెక్టివిటీ చక్కగా ఉంటుంది. అయితే ఈ బడ్స్ వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తారు. దీని ధర 179 డాలర్లు.

Image result for google launches new gadgets in made by google  19

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle