newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గూగుల్ అసిస్టెంట్‌లో కొత్త ఫీచర్ గురించి తెలుసా?

16-12-201916-12-2019 13:38:36 IST
Updated On 16-12-2019 13:38:33 ISTUpdated On 16-12-20192019-12-16T08:08:36.002Z16-12-2019 2019-12-16T08:08:24.486Z - 2019-12-16T08:08:33.766Z - 16-12-2019

గూగుల్ అసిస్టెంట్‌లో కొత్త ఫీచర్ గురించి తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ టెక్నాలజీ సంస్థ, సెర్చింజన్ గూగుల్ రోజుకో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెస్తోంది. ఈమధ్యే లైట్లు ఎక్కువగా ఉండే రోడ్ల గురించిన ఫీచర్ తీసుకురాగా తాజాగా గూగుల్‌ అసిస్టెంట్‌లో ట్రాన్స్ లేటర్ మోడ్‌ సౌకర్యాన్ని తమ కస్టమర్లకు అందిస్తోంది. ఈ ట్రాన్స్ లేషన్‌ ఫీచర్‌ను వాడుకొని ప్రపంచంలోని దాదాపు 44 భాషల్లో మాట్లాడుకునే అద్భుత అవకాశం కలుగుతుంది. 

భారతీయ భాషలైన బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, ఉర్దూ తదితర తొమ్మిది భాషల్లో ఈ ఫీచర్‌ పనిచేస్తుందని గూగుల్ చెబుతోంది. ఈ ఫీచర్ ఎంత సులువుగా ఉంటుందంటే మనం మనకు తెలిసిన భాషలో మాట్లాడి.. దానిని మీకు అవసరం అయిన భాషలో తర్జుమా చేసి పెట్టమంటే ఇట్టే చేసేస్తుంది. ఉదాహరణకు తెలుగులో మాట్లాడి దానిని ఇంగ్లీషులోకి అనువాదం చేయమంటే చిటికెలో చేసేస్తుంది. 

వివిధ పనుల నిమిత్తం ఇప్పుడు ఉద్యోగులు ఇతర దేశాలకు, పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు. అక్కడ భాష తెలియకపోతే కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ గూగుల్ అసిస్టెంట్ మీ చేతిలో వుంటే చాలు.. మీ పని చాలా సులభం అవుతుంది. గూగుల్‌ హోమ్‌ డివైజెస్‌, స్మార్ట్‌ డిస్‌ప్లేలలో ఈఫీచర్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ స్మార్ట్ టెక్నాలజీని అన్ని స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి తెచ్చింది.

గూగుల్‌ అసిస్టెంట్‌ లోకి వెళ్లి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని.. ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. ఐఫోన్‌ వినియోగదారులు కూడా ఈ సదుపాయం కల్పించింది. మీ దగ్గర ఆండ్రాయిడ్ లేదా ఐ ఫోన్ వుంటే సింపుల్ గా ‘‘ఓకే గూగుల్‌ లేదా హే గూగుల్‌’’ అనే వాయిస్‌ కమాండ్‌తో ఈ సదుపాయం అందుకోవచ్చు.

గూగుల్‌ అసిస్టెంట్‌ను అండ్రాయిడ్‌ ఫోన్లలో పవర్‌ బటన్‌ను ప్రెస్‌ చేయడం ద్వారా ఓపెన్ చేయవచ్చు. మీకు వచ్చిన భాషలో మాట్లాడితే.. కావాల్సిన భాషలోకి గూగుల్‌ అసిస్టెంట్‌ అనువదిస్తుంది. కొత్త కొత్త భాషలు నేర్చుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle