newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గూగుల్‌ మ్యాప్స్‌లో ‘ఇన్‌కాగ్నిటో’ మోడ్‌ వచ్చేస్తోంది!

23-09-201923-09-2019 19:05:32 IST
2019-09-23T13:35:32.677Z23-09-2019 2019-09-23T13:35:30.477Z - - 12-04-2021

గూగుల్‌ మ్యాప్స్‌లో ‘ఇన్‌కాగ్నిటో’ మోడ్‌ వచ్చేస్తోంది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గూగుల్‌ క్రోమ్‌లో చాలామందికి ఉపయోగపడే అంశాల్లో ‘ఇన్‌కాగ్నిటో’ మోడ్‌ ఒకటి. బ్రౌజర్‌లో సెర్చ్‌ చేసిన హిస్టరీ స్టోర్‌ కాకుండా ఉండటం దీని ప్రత్యేకత. యూజర్స్‌ ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని గూగుల్‌ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ అత్యవసరమైన ఫీచర్‌ను గూగుల్‌ మ్యాప్స్‌లోకి కూడా తీసుకురావడానికి గూగుల్‌ ప్రయోగాలు చేస్తోంది. ప్రస్తుతం గూగుల్‌ మ్యాప్స్‌లో మీరెక్కడికి వెళ్లారు.. ఎంతసేపు ఉన్నారు లాంటి వివరాలు ఆటోమేటిక్‌గా నోట్‌ అయిపోతాయి. దీని వల్ల ప్రైవసీకి భంగం కలుగుతోందని గత కొంతకాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. వీటికి విరుగుడుగా గూగుల్‌ ‘ఇన్‌కాగ్నిటో’ ఫీచర్‌ను తీసుకొస్తోంది. 

గూగుల్‌ మ్యాప్స్‌లో ఇన్‌కాగ్నిటో మోడ్‌ అందుబాటులోకి వచ్చాక  దాన్ని ఇలా యాక్టివ్‌ చేసుకోవాలి. మ్యాప్స్‌ ఓపెన్‌ చేశాక రైట్‌ టాప్‌ కార్నర్‌లో ఉన్న ప్రొఫైల్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి. అప్పుడు యాప్‌ ఇన్‌కాగ్నిటో మోడ్‌లోకి వెళ్లిపోతుంది. యాక్టివ్‌ చేసుకున్నాక క్రోమ్‌ స్టైల్‌లో ఓ నలుపు బార్‌ కనిపిస్తుంది. 

అందులో ఇన్‌కాగ్నిటో మోడ్‌ అని కనిపిస్తుంది. దాని పక్క ఇన్‌కాగ్నిటో మోడ్‌ను తెలిపేలా హ్యాట్‌, గ్లాసెస్‌ ఉన్న మనిషి ముఖం లోగో కూడా కనిపిస్తుంది. అప్పుడు మీరు మ్యాప్స్‌లో సెర్చ్‌చేసిన సమాచారం, మీరు తిరిగిన రూట్‌ లాంటివి మీ అకౌంట్‌లో సేవ్‌ అవ్వవు.  ఆండ్రాయిడ్‌ ఆటో యాప్‌లో కూడా ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో అందరూ వినియోగించుకోవచ్చు. 

గూగుల్‌ మ్యాప్స్‌ మరో ఆసక్తికరమైన ఫీచర్‌ను కూడా టెస్టింగ్‌ చేస్తోంది. ప్రస్తుతం మ్యాప్స్‌ ఉపయోగించేటప్పుడు తరచూ మొబైల్స్‌ చూడాల్సి వస్తుంటుంది. వీధులు మారినప్పుడు, మలుపు తిరిగినప్పుడు ఇదేనా ఆ మలుపు అని ఒకటికి రెండుసార్లు చూడాల్సి వస్తోంది. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా గూగుల్‌ ఓ కొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది. ‘

ఐస్‌ ఫ్రీ మోడ్‌’ పేరుతో రూపొందుతున్న ఈ ఫీచర్‌తో ఇకపై వాయిస్‌ కమాండ్స్‌, ఇన్ఫర్మేషన్‌ మరింత పక్కాగా ఉండబోతోంది. అంటే ‘నెక్ట్స్‌ వస్తున్న లెఫ్ట్‌ తీసుకోండి’ అని ఇప్పుడు మ్యాప్స్‌లో చెబుతుంటే... ఇకపై ‘లెఫ్ట్‌లో ఉన్న పెట్రోల్‌ బంక్‌ నుంచి కాస్త ముందుకు వెళ్తే వచ్చే జంక్షన్‌లో రైట్‌ తీసుకోండి’ అని మ్యాప్స్‌ సూచనలు చేస్తుంది. ఒకవేళ అనుకున్న రూట్‌ కాకుండా వేరే రూట్‌లోకి వెళ్తే మ్యాప్స్‌ సూచనలు చేస్తుంది. ఈ ఫీచర్‌ కూడా త్వరలో అందరికీ అందుబాటులో వస్తుంది. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle