newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

గూగుల్‌ పేలో బంగారాన్ని బహుమతిగా ఇవ్వొచ్చు!

30-11-201930-11-2019 14:24:07 IST
2019-11-30T08:54:07.222Z30-11-2019 2019-11-30T08:53:58.782Z - - 06-12-2019

గూగుల్‌ పేలో బంగారాన్ని బహుమతిగా ఇవ్వొచ్చు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతీయుల ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌లో ఇప్పుడు ‘గూగుల్‌ పే’ ది ప్రత్యేక స్థానం. డబ్బులు పంపించు అనే మాటకు బదులు గూగుల్‌ పే చెయ్‌ అనేది వచ్చేంతగా పరిస్థితి మారిపోయింది. దానికి తగ్గట్టుగానే గూగుల్‌ కూడా గూగుల్‌ పేలో రివార్డ్స్‌ రూపంలో డబ్బులు కూడా ఇస్తోంది. దీంతో ఈ యాప్‌ మరింతగా ప్రజల్లోకి చేరిపోయింది. ఆ తర్వాత దాంట్లో కొత్త ఫీచర్లను యాడ్‌ చేస్తూ వచ్చింది. బిల్లులు పే చేయడం, ట్రైన్‌ టికెట్లు బుక్‌ చేయడం లాంటివి అలా వచ్చినవే. ఇప్పుడు గూగుల్‌ పేలో మరో కొత్త ఆప్షన్‌ రాబోతోంది. ఇటీవల వచ్చిన గోల్డ్‌ పర్చేజ్‌లో గోల్డ్‌ గిఫ్టింగ్‌ ఆప్షన్‌ను కూడా తీసుకొస్తున్నారు. 

గూగుల్‌ పే యాప్‌ను ఇటీవలే రీడిజైన్‌ చేశారు. తాజాగా మరోసారి రీడిజైన్‌ చేయబోతున్నారట. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. అందులోనే గోల్డ్‌ గిఫ్టింగ్‌ ఆప్షన్‌ టెక్‌ నిపుణులు గుర్తించారు. గూగుల్‌ పేలో గోల్డ్‌ పర్చేజ్‌ ఆప్షన్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో లాంచ్‌ చేశారు. ఎంఎంటీసీ-పీఏఎంపీతో పార్టనర్‌ షిప్ తీసుకొని గూగుల్‌ ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా 99.99 శాతం  24 క్యారట్‌ బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. 

గూగుల్‌ పేలో కొనుగోలు ఎంత చిన్న మొత్తంలో అయినా బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. అలా కొన్న బంగారం ఎంఎంటీసీ-పీఏఎంపీ కు చెందిన గోల్డ్‌ అక్యుములేషన్‌ ప్లాన్‌లో స్టోర్‌ అవుతుంది. ఇది ఆ యూజర్‌కు చెందిన పూర్తి భద్రత ఉన్న వాల్ట్‌. ఇలా కొనుగోలు చేసిన బంగారానికి 100 శాతం ఇన్సూరెన్స్‌ ఉంటుంది.  ఇలా కొనుగోలు చేసిన బంగారం గోల్డ్‌ వ్యాలెట్‌లో డిజిటల్‌ రూపంలో కనిపిస్తుంది. దీనిని జీఏపీ అకౌంట్‌ బ్యాలెన్స్‌ అంటారు.  

జీఏపీ అకౌంట్‌లోని బంగారాన్ని మీరు ఇతరులకు గిఫ్ట్‌ రూపంలో పంపొచ్చు. అయితే ఇది ఎలా పని చేస్తుందనే పూర్తి సమాచారం మరికొద్ది రోజుల్లో బయటకు వస్తుంది. గిఫ్టింగ్‌కు సంబంధించిన ఆప్షన్‌ కోడింగ్‌ టెక్‌ నిపుణులు గూగల్‌ పే యాప్‌లో గమనించారు. అంటే వీలైనంత త్వరలో ఈ ఆప్షన్‌ మన దేశంలో అందుబాటులోకి వస్తుంది.  అన్నట్లు వ్యాటెట్‌లోని బంగారాన్ని అవసరమైతే మీకు డెలివరీ కూడా చేస్తారు. అయితే ఈ ఆప్షన్‌ కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. 

Image result for you may gift gold through google pay soon

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle