newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘గూగుల్‌ పే’లో క్రెడిట్‌ కార్డులు వస్తున్నాయ్‌!

20-09-201920-09-2019 13:40:09 IST
2019-09-20T08:10:09.083Z20-09-2019 2019-09-20T07:25:54.439Z - - 23-04-2021

‘గూగుల్‌ పే’లో క్రెడిట్‌ కార్డులు వస్తున్నాయ్‌!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఒకప్పుడు ఆన్‌లైన్‌లో ఎవరికైనా డబ్బులు పంపాలంటే అకౌంట్‌ నెంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ కావాలి. ఏ ముహూర్తాన భారత ప్రభుత్వం యూపీఐ విధానాన్ని తీసుకొచ్చిందో గానీ అందరూ చాలా సులభంగా డబ్బులు పంపేస్తున్నారు. దానికి తోడు గూగుల్‌ పే (ఒకప్పుడు టెజ్‌) రావడంతో ఇది ఇంకా చాలా సులభం అయిపోయింది.  వోచర్లు, క్యాష్‌ బ్యాక్‌లు అంటూ యూజర్లకు గూగుల్‌పే బాగా దగ్గరైంది. ఇప్పుడు మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇవి ఏమేర వినియోగదారులను ఆకట్టుకుంటాయో చూడాలి. వీటిలో ఒకటి యూజర్లకు సులభతరమైన పేమెంట్‌ విధానాన్ని అందిస్తుంది.  మరొకటి దుకాణదారులకు ఉపయుక్తంగా నిలుస్తుంది.

టోకెనైజ్డ్‌ కార్డ్స్‌ ఇలా వాడాలి...

ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో  క్రెడిట్‌ కార్డు ద్వారా పేమెంట్‌ చేసేటప్పడు కార్డు నెంబరు, పిన్‌, సీవీవీ లాంటి వివరాల్లో ఏదో ఒకటి కచ్చితంగా ఇవ్వాల్సిందే. దీని వల్ల ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగతున్నాయి. ఇలాంటి ఇబ్బందులు తొలగించడానికి గూగుల్‌ పేలో కొత్తగా ఓ ఆప్షన్‌ తీసుకొస్తున్నారు. దీని ద్వారా మీ క్రెడిట్‌ కార్డు వివరాలు ముందుగా గూగుల్‌ పేలో యాడ్‌ చేసుకోవాలి.  ఆ తర్వాత పేమెంట్‌ చేసేటప్పుడు అసలు ముఖ్యమైన వివరాలు ఇవ్వకుండా టోకెన్‌ నెంబర్లతో పేమెంట్‌ చేయొచ్చు. దీనినే గూగుల్‌ పే టోకెనైజ్డ్‌ కార్డ్స్‌ అని పిలుస్తారు. ఇప్పటివరకు బ్యాంక్‌ ఖాతాల ఆధారిత పేమెంట్‌ సేవలు మాత్రమే గూగుల్‌పేలో అందుబాటులో ఉండగా.. కార్డ్స్‌ ఆప్షన్‌ ద్వారా ఇకపై కార్డులను కూడా వినియోగించుకునే వీలుంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌, కోటక్‌, స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌కు చెందిన కార్డు ఖాతాదారులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది. అందులోనూ వీసా కార్డు వినియోగదారులకు ఈ ఆప్షన్‌ ప్రస్తుతం తీసుకొస్తున్నారు. త్వరలో మాస్టర్‌, రూపే కార్డు వినియోగదారులూ ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. 

స్పాట్‌ ప్లాట్‌ఫామ్‌ లెక్క ఇదీ....

విక్రేతలను దృష్టిలో పెట్టుకుని గూగుల్‌ ఈ కొత్త  సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వ్యాపార సంస్థలు తమ  ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఓ సైట్‌ లేదా, యాప్‌ను రూపొందించుకోవాలి. ఇకపై ఆ అవసరం లేకుండా గూగుల్‌ పే ఆ సౌకర్యం అందిస్తోంది. త్వరలో గూగుల్‌ పే లోని ‘స్పాట్‌ ఫ్లాట్‌ఫాం’ ద్వారా వ్యాపారులు వెబ్‌సైట్‌/యాప్‌లో అందుబాటులో ఉండే సౌకర్యాలను పొందొచ్చు. దీని కోసం ఆ సంస్థలు గూగుల్‌పేలో నమోదు కావాలి.  అప్పుడు గూగుల్‌ పేలో ఆ సంస్థ ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి సమాచారం లభిస్తుంది. అంటే వినియోగదారుడు బస్‌ టికెట్‌ను గానీ, ఆన్‌లైన్‌లో ఫుడ్‌ను గానీ  బుక్‌ చేయాలనుకుంటే సంబంధిత యాప్‌కు వెళ్లకుండా ‘స్పాట్‌’ ఫీచర్‌ను ఉపయోగించి గూగుల్‌ పేలోనే ఆర్డర్‌ చేసి పేమెంట్‌ చేసేయొచ్చు.  ప్రస్తుతానికి గూగుల్‌ పేలో  మేక్‌మై ట్రిప్‌, ఈట్‌.ఫిట్‌, గో ఐబిబో, ఒవెన్‌ స్టోరీ, రెడ్‌బస్‌, అర్బన్‌ క్లాప్‌ లాంటి సర్వీసులు ఉన్నాయి.త్వరలో మరిన్ని  కంపెనీలను ‘స్పాట్‌’ పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం ఈ రెండు ఫీచర్లు కొందరికే అందుబాటులో ఉన్నాయి. త్వరలో అందరూ వాడుకోవచ్చు. 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle