‘గూగుల్ పిక్సెల్ 4’ ఇలానే ఉంటుంది..!
12-09-201912-09-2019 17:11:15 IST
2019-09-12T11:41:15.282Z12-09-2019 2019-09-12T11:41:03.638Z - - 23-04-2021

శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్షిప్ మొబైల్స్ గెలాక్సీ ఎస్10 సిరీస్‌ను తీసుకొచ్చేసింది. యాపిల్ 11వ తరం మొబైల్స్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ నుంచి త్వరలో వన్‌ప్లస్ 7టి సిరీస్ మొబైళ్లు రాబోతున్నాయి. ఇక లాంచ్ చేయాల్సిందల్లా పిక్సెల్ ఫోన్లే. ప్రస్తుతం గూగుల్ ఆ పని మీదే ఉంది. వచ్చే నెల 15న పిక్సెల్ సిరీస్ నాలుగో తరం మొబైళ్లను లాంచ్ చేయబోతోంది. పిక్సెల్ 4, పిక్సెల్ 4 ఎక్స్ఎల్ ఇప్పటికే దీనికి సంబంధించిన ఫొటోలు, స్పెషిఫికేషన్లు బయటకు వచ్చాయి. ఇప్పుడు మరిన్ని వివరాలు తెలిశాయి.
తాజా లీక్‌ల ప్రకారం పిక్సెల్ 4 సిరీస్ మొబైళ్లలో 90 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే ఉంటుంది. వెనుకవైపు రెండు కెమెరాలు ఉంటాయి. అయితే ఆ కెమెరాల స్పెషిఫికేషన్ తెలియాల్సి ఉంది. గత మొబైళ్ల కంటే ఎక్కువ ర్యామ్ ఉంటుందని మాత్రం తెలుస్తోంది. ఈ మొబైళ్లలో మోషన్ సెన్సింగ్ టెక్నాలజీ ఉండబోతోంది. ఈసారి కొత్తగా కోరల్ కలర్డ్ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీటితోపాటు మోషన్ సెన్సింగ్ సాంకేతికత కూడా ఉండబోతోంది. మెషన్ సెన్సింగ్, డ్యూయల్ రేర్ కెమెరా గురించి గూగుల్ ఇదివరకే కన్ఫర్మేషన్ ఇచ్చింది.
పిక్సెల్ 4 సిరీస్ మొబైళ్లలో 6 జీబీ ర్యామ్ ఉంటుంది. లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 855తో ఈ మొబైళ్లు పని చేస్తాయి. పిక్సెల్ 4లో ... 5.7 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండబోతోంది. దీని రిజల్యూషన్ 1440X3030 గా ఉండనుంది. ఈ మొబైళ్లలో 2800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అదే పిక్సెల్ 4 ఎక్స్ఎల్లో అయితే 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. ఈ మొబైల్లో 3700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. పిక్సెల్ 4 మొబైళ్లు వైట్, బడ్జెట్, కోరల్ రంగుల్లో అందుబాటులో ఉంటాయి.
మీరు ఇంకా గూగుల్ పిక్సెల్ 4 గురించి తెలుసుకోవాలంటే క్రింద ఉన్న లింక్స్ లో వీడియోస్ చూడొచ్చు
https://youtu.be/Oo0Ilwe3IwM
https://youtu.be/aFjbzTLNMAo


థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
21 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా