newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గూగుల్‌కి పోటీగా హువాయ్ యాప్స్

26-12-201926-12-2019 14:53:12 IST
2019-12-26T09:23:12.962Z26-12-2019 2019-12-26T09:23:10.939Z - - 10-04-2021

గూగుల్‌కి పోటీగా హువాయ్ యాప్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గూగుల్ యాప్స్‌కి పోటీగా మరో యాప్స్ రెడీ అవుతున్నాయా? గూగుల్ గుత్తాధిపత్యం తగ్గించడానికి ప్రముఖ చైనా సంస్థ హువాయి ఇండియా వైపు తన ఫోకస్ పెట్టింది. గూగుల్ కి సంబంధించి యాప్ లైన మ్యాప్స్, పేమెంట్స్, మెసేజింగ్ వంటి యాప్‌లకు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయబోతోంది. దేశీయ మార్కెట్లో హువాయి మరియు దాని అనుబంధ సంస్థ హానర్ చొచ్చుకుపోతున్నాయి.

ఇటీవల హానర్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఇటీవల విడుదల చేసింది. గూగుల్ మీడియా సర్విసెస్ తరహాలోనే హువాయి మీడియా సర్వీసెస్ రంగంలోకి దిగింది. అచ్చం గూగుల్ పేకి ప్రత్యామ్నాయంగా నావిగేషన్, పేమెంట్స్, గేమింగ్ మరియు మెసేజింగ్ వంటి చాలా ముఖ్యమైన యాప్‌లను అభివృద్ధి చేసింది. త్వరలో వీటిని టెస్టింగ్ చేసి మార్కెట్లోకి వదిలేందుకు సిద్ధం అవుతున్నట్టు హువాయి మరియు హానర్ ఇండియా సీఈవో చార్లెస్ పెంగ్ చెప్పారు.

హువాయ్ మీడియా సర్వీసెస్ యాప్ లు చాలా సింపుల్ గా వుంటాయని, అవి త్వరగా  ప్రజల దృష్టిని ఆకట్టుకుంటాయనే నమ్మకంతో వుంది. హువాయి అప్లికేషన్లు 100 నుండి 150 వరకూ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు అంటున్నారు. గూగుల్‌తో పోలిస్తే హువాయి వినియోగదారుల మన్ననలు ఎలా పొందుతుందో చూడాలి. హువాయి కూడా మంచి యాప్‌లను తీసుకువస్తే ఈ సంస్థకు భవిత వుంటుంది. మరోవైపు సెక్యూరిటీ, వ్యక్తిగత సమాచారం భద్రత హువాయికి సవాల్ కానుంది. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle