newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గత నెల వాట్సాప్‌ అప్‌డేట్‌ చేసుకున్నారా... లేదంటే!

17-11-201917-11-2019 15:38:12 IST
2019-11-17T10:08:12.363Z17-11-2019 2019-11-17T10:07:46.797Z - - 14-04-2021

గత నెల వాట్సాప్‌ అప్‌డేట్‌ చేసుకున్నారా... లేదంటే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వాట్సాప్‌ యూజర్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అంశం... పీగాసూస్‌. యూజర్ల మొబైళ్లను సులభంగా హ్యాక్‌ చేయడం దీని విధానం. ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో తెలియకుండా చాలామంది యూజర్లను ఇబ్బంది పెడుతోంది. తాజాగా ఇలాంటిదే మరో ఇబ్బంది వచ్చి పడింది. ఎంపీ4 వీడియో ఫైళ్ల ద్వారా యూజర్ల మొబైళ్లలోకి దొంగతనంగా చేరి... స్పైవేర్‌ను తీసుకొస్తోంది. ఆ తర్వాత మొబైల్‌ అగంతుకుల చేతిలోకి చేరిపోతుంది.  ఈ సెక్యూరిటీ బ్రీచ్‌ను హై సివియారిటీ కేటగిరీ కిందకు వస్తాయని కంప్యూటర్‌ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌టీ) స్పష్టం చేసింది. 

పీగాసూస్‌ ఫీచర్లు ఇలా ఉంటాయ్‌!

వాట్సాప్‌ పీగాసూస్‌ అనే స్పైవేర్‌ని ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ క్రియేట్‌ చేసినట్లు చెబుతున్నారు. వాట్సాప్‌ వీడియో కాలింగ్‌ ద్వారా ఈ స్పైవేర్‌ మొబైళ్లలోకి వస్తోందని తేలింది. తాజా స్పైవేర్‌ సంగతికొచ్చేసరికి ఎంపీ4 వీడియో ద్వారా  స్టాక్‌ బేస్ట్‌ బఫర్‌ ఓఫర్‌ ఫ్లోగా వస్తోంది. ఈ స్పైవేర్‌ వల్ల అగంతుకులు  డినయల్‌ ఆఫ్‌ సర్వీసెస్‌ (డీవోఎస్‌), రిమోట్‌ కోడ్‌ ఎగ్జిక్యూషన్‌ (ఆర్‌సీఈ) పై అటాక్‌ చేసి ఫోన్‌ను హ్యాక్‌ చేస్తారు. దీని వల్ల ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, విండోస్‌ డివైజ్‌లు హ్యాకింగ్‌ గురవుతున్నాయి. 

పీగాసూస్‌ స్పైవేర్‌ వల్ల అగంతుకులు యూజర్ల మొబైల్‌ నెంబరును తెలుసుకోగలుగుతారు. ఆ తర్వాత ఆ మొబైల్‌లో ఇబ్బందికర ప్రోగ్రామ్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తారు. దీంతో మీ మొబైల్‌ అగంతులకు చేతుల్లోకి పూర్తిగా వెళ్లిపోతుంది. ఈ స్పైవేర్‌ కేవలం వాట్సాప్‌కే కాకుండా వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌లోనూ వస్తోంది. ఈ ఇబ్బందిని తొలగిస్తూ గత నెల వాట్సాప్‌ కొత్త వెర్షన్‌ను రిలీజ్‌ చేసింది. కాబట్టి మీ మొబైల్‌లో వాట్సాప్‌ అప్‌డేటడ్‌ వెర్షన్‌ ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ లేకపోతే వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి. 

పీగాసూస్‌ స్పైవేర్‌ వల్ల మన దేశంలో పది మందికిపైగా సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, న్యాయవాదుల మొబైళ్లు హ్యాక్‌ అయ్యాయని తెలిసింది.  ఈ విషయంలో ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ మీద వాట్సాప్‌ అమెరికా కోర్టులో కేసు వేసింది. నియమనిబంధనలకు తగ్గట్టుగా ఎన్‌ఎస్‌వో వ్యవహరించలేదని కేసులో పేర్కొంది. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle