గంటకు 305 కి.మీ వేగంతో ప్రయాణించే కారు
05-03-202005-03-2020 15:09:26 IST
2020-03-05T09:39:26.765Z05-03-2020 2020-03-05T09:39:23.697Z - - 14-04-2021

ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్‌ను బట్టి చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే పెట్రోల్, డిజిల్ కార్ల కన్నా, కాలుష్యానికి హాని కలిగించని ఎలక్ట్రిక్ కార్ల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని మోటారు రేసింగ్ ఔత్సాహికుల కోసం కంపెనీలు సరికొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి.
వాటిలో భాగంగానే గంటకు 305 కిలోమీటర్ల వాయు వేగంతో ప్రయాణించే ఏపీ-1 అనే ఎలక్ట్రిక్ సూపర్ కారును అపెక్స్ మోటార్స్ వారం రోజుల్లో ఆవిష్కరించనుంది. హాంకాంగ్‌కు చెందిన ఇద్దరు సోదరులు ఈ సూపర్ కారును రూపకల్పన చేశారని కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఏపీ 1 సూపర్ కారు 620కిలోగ్రాముల బరువు, కార్బన్ ఫైబర్‌తో కూడిన అత్యుధునిక డిజైన్లతో రూపిందించినట్లు తెలుస్తోంది. కొండ ప్రాంతాలలో కూడా ఏపీ-1 కారు వేగంతో ప్రయాణిస్తున్నట్లు ఆవిష్కర్తలు చెబుతున్నారు.
ఏపీ 1 ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జింగ్‌తో 515 కిలోమీటర్లు ప్రయాణించగలదని, ఫాస్ట్ చార్జర్‌తో 20 నిముషాల్లో 80శాతం చార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగానే ఎలక్ట్రిక్ కారు రూపకల్పన చేశామని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అపెక్స్ మోటార్స్ ఈ ఆల్ ఎలెక్ట్రిక్ ఏపీ-ఓ వాహనాన్ని ఈ వారం జరగాల్సి ఉన్న జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ప్రదర్సించాలనుకుంది కానీ కరొనా వైరస్ బద్దలవటంతో ఆ కార్యక్రమం రద్దయింది. దీంతో మార్చి 13న లైవ్-స్ట్రీమ్డ్ కార్యక్రమంలో ఈ వాహనాన్ని ప్రవేశపెట్టాలని కంపెనీ చూస్తోంది.



గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా