newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క‌రోనా విజృంభిస్తున్న వేళ ఈ యాప్‌లతో ఉపయోగమెంతో?

04-04-202004-04-2020 08:39:24 IST
Updated On 04-04-2020 10:06:49 ISTUpdated On 04-04-20202020-04-04T03:09:24.612Z04-04-2020 2020-04-04T03:09:08.269Z - 2020-04-04T04:36:49.572Z - 04-04-2020

క‌రోనా విజృంభిస్తున్న వేళ ఈ యాప్‌లతో ఉపయోగమెంతో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న క‌రోనా వైర‌స్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా పాజిటీవ్ కేసులు ఒక్క‌సారిగా పెరిగాయి. దీంతో ప్ర‌జ‌లంతా క‌రోనా వైర‌స్ ప‌ట్ల మ‌రింత జాగ్ర‌త్త వ‌హించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇందు కోసం కొన్ని యాప్‌లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి. ప్ర‌స్తుతం అంద‌రి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్లు ఉన్నందున ప్ర‌త్యేకంగా క‌రోనా వైర‌స్ కోస‌మే రూపొందించిన ఈ యాప్‌ల ద్వారా అప్ర‌మ‌త్తంగా ఉండే అవ‌కాశం ఉంది.

కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా వైర‌స్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు అప్ర‌మ‌త్తం చేయ‌డం కోసం ఆరోగ్య‌సేతు అనే ప్ర‌త్యేక యాప్‌ను రూపొందించింది. 11 భాష‌ల్లో రూపొందించిన ఈ యాప్ ద్వారా క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన వారు ఎక్క‌డెక్క‌డ ఉన్నారనే విష‌యం తెలుస్తుంది. క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన స‌మాచారం, ప్ర‌భుత్వం, వైద్యుల సూచ‌న‌లు నేరుగా ప్ర‌జ‌లకు చేరుతాయి. యాపిల్‌, ఆండ్రాయిడ్‌కు సంబంధించి ఈ యాప్ అందుబాటులో ఉంది.

ప్రైవేటు టెలికాం సంస్థ‌లు ఎయిర్‌టెల్‌, జియో కూడా క‌రోనా వైర‌స్ ప‌ట్ల త‌మ వినియోగ‌దారుల‌కు ఉప‌యోగ‌ప‌డే యాప్‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. జియో వినియోగ‌దారుల‌కు మై జియో యాప్ ద్వారానే కరోనా వైర‌స్‌కు సంబంధించిన స‌మాచారం అందిస్తుంది. ఎవ‌రైనా వ్య‌క్తి ఈ యాప్ ఓపెన్ చేస్తే అత‌డి వ‌య‌స్సు, ట్రావెల్ హిస్ట‌రీ, ఆరోగ్య ప‌రిస్థితికి సంబంధించ‌న ప‌లు ప్ర‌శ్న‌లు అడుగుతుంది. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌రైనా స‌మాధానాలు ఇస్తే స‌ద‌రు వ్య‌క్తికి క‌రోనా పాజిటీవ్‌కు సంబంధించి ఎంత రిస్క్ ఉంద‌నేది యాప్ చెబుతోంది.

ఆ వ్య‌క్తికి క‌రోనా వ‌చ్చే రిస్క్ ఏ స్థాయిలో ఉందో, దానిని బ‌ట్టి తీసుకోవాల్సి చ‌ర్య‌ల గురించి కూడా యాప్ చెబుతుంది. క‌రోనా వైర‌స్‌కు సంబంధించి స్థానిక‌, జాతీయ హెల్ప్ లైన్ నెంబ‌ర్లు, వైర‌స్‌కు సంబంధించి ప‌రీక్ష‌లు జ‌రిపే కేంద్రాల వివ‌రాలు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. క‌రోనా వైర‌స్ ప‌ట్ల ప్ర‌జ‌లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు కూడా ఇందులో ఉంటాయి.

మ‌రో టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కూడా క‌రోనా వైర‌స్ కోస‌మే ప్ర‌త్యేకంగా అపోలో ఆసుప‌త్రి స‌హ‌కారంతో అపోలో 247 అనే పేరుతో యాప్‌ను రూపొందించింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌, కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ సూచ‌న‌ల ప్ర‌కారం ఈ యాప్ ఉంటుంది. ఇందులో కూడా వినియోగ‌దారుడికి సంబంధించి ప‌లు ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు తీసుకొని, ఆ వ్య‌క్తికి క‌రోనా రిస్క్ ఎంత ఉంద‌నే విష‌యాన్ని యాప్ చెబుతుంది. ఎయిర్‌టెల్ థ్యాక్స్ యాప్‌లోనూ ఈ టూల్ అందుబాటులో ఉంది.

అయితే, కేవ‌లం కొంత స‌మాచారం, అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే ఈ యాప్‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఎవ‌రికైనా క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డ‌మే ఉత్త‌మం. వైద్య ప‌రీక్ష‌ల ద్వారానే క‌రోనా వైర‌స్ పాజిటీవ్ లేదా నెగ‌టీవ్ అనే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తుంది.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle