కరోనాతో పోటీ పడుతున్న ఫేక్ న్యూస్
29-03-202029-03-2020 16:48:41 IST
2020-03-29T11:18:41.950Z29-03-2020 2020-03-29T11:18:37.914Z - - 10-04-2021

కరోనా వైరస్ ఒకవైపు వేగంగా వ్యాప్తి చెందుతుంటే మరో వైపు ఫేక్ న్యూస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రజలంతా పెరుగుతున్న కరోనా పాజిటీవ్ కేసులతో ఆందోళనలో ఉంటే సోషల్ మీడియాలో రోజుకో తప్పుడు ప్రచారం వారిని మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్ వైరల్‌గా మారుతోంది. దీంతో ఏది నమ్మాలో, ఏదీ నమ్మకూడదో కూడా తేల్చుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారు. ప్రభుత్వాలు తప్పుడు ప్రచారాలు చేస్తే జైలుకు పంపిస్తామని ఎన్ని హెచ్చరికలు చేసినా తప్పుడు ప్రచారాలు మాత్రం ఆగడం లేదు. వారం రోజుల క్రితం ఓ ప్రచారాన్ని ప్రజలు విపరీతంగా నమ్మారు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని ఎవరో ఆకతాయిలు.. మగ పిల్లలు వేప చెట్టుకు పసుపు నీళ్లు పోయాలని, లేకపోతే దోషం అంటూ ఓ తప్పుడు ప్రచారం సృష్టించారు. దీంతో తల్లిదండ్రులు ఈ ప్రచారాన్ని నిజమే అనుకొని నమ్మి మగపిల్లలతో వేపచెట్లను వెతికి మరీ పసుపు నీళ్లు పోయించారు. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని, ప్రజలు బయటకు రావొద్దని ప్రభుత్వం చెబుతున్నా వేప చెట్ల వద్దకు క్యూ కట్టారు. ఇక రెండు రోజుల క్రితం బ్రహ్మం గారి ఆలయంలో ఓ పూజారి కరోనా వైరస్‌కు విరుగుడు చెప్పి మరణించాడని, నీళ్లలో బెల్లం, అల్లం, మెంతులు కలిపి తాగితే కరోనా రాదని చెప్పాడని ఓ తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకరికొకరు ఫోన్లు చేసి మరీ ఈ విషయాన్ని చెప్పుకున్నారు. దీంతో అంతా ఇందులో చెప్పినట్లు తాగారు. దీంతో ఈ ప్రచారం అబద్ధమని, అసలు బ్రహ్మం గారి ఆలయంలో పూజారి ఎవరూ మరణించలేదని ఆలయ నిర్వాహకులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా, ఓ సీనియర్ రిపోర్టర్‌తో ప్రముఖ ఆసుపత్రికి చెందిన వైద్యుడు ఫోన్లో సంభాషించినట్లుగా చెబుతున్న ఎనిమిది నిమిషాల ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనాపై ప్రజల్లో భయాందోళనలు కల్పించేలా ఈ ఆడియో ఉంది. ఈ ఆడియో క్లిప్ రెండు రోజులుగా విచ్చలవిడిగా వైరల్ అవుతోంది. అయితే, ఈ ఆడియో క్లిప్ తమ వైద్యుడిది కాదంటూ సదరు ఆసుపత్రి నిర్వాహకులు పోలీసులకు కూడా పిర్యాదు చేశారు. అయినా, ఈ ఆడియో వైరల్ అవుతూనే ఉంది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాటలుగా చెబుతూ మరో ఆడియో క్లిప్‌ను కూడా నెటిజన్లు వాట్సాప్‌లో బాగా షేర్ చేస్తున్నారు. ఈ ఆడియోతో తనకు సంబంధం లేదని స్వయంగా లక్ష్మీనారాయణనే ఓ వీడియో విడుదల చేయాల్సి వచ్చింది. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ అందరికీ వెయ్యి జీబీ ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తున్నారని, ఎయిర్టెల్, జియో కూడా లాక్డౌన్ కోసం ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తోందంటూ రకరకాల మెసేజ్‌లు కూడా విచ్చలవిడిగా షేర్ అవుతున్నాయి. ఇవన్నీ అబద్ధాలే. ఇటలీ, స్పెయిన్‌లో శవాల దిబ్బలు అంటూ ఓ హాలీవుడ్ సినిమాలోని సీన్‌ను వీడియో రూపంలో వైరల్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు మిలిటరీ దిగిందంటూ పాత వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. కరోనా వైరస్‌కు మందు కనిపెట్టారనే అబద్ధపు ప్రచారం కూడా ఓ రేంజ్లో సాగుతోంది. తెలంగాణలో వైన్‌షాపులు తెరుస్తున్నారంటూ నకిలీ ఆర్డర్ కాపీనే సృష్టించారు. ఇప్పటికే కరోనా వైరస్‌తో భయంగా ఉన్న ప్రజలను ఈ ఫేక్ న్యూస్‌లు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజలు భయాంతో ఉన్నప్పుడు ఏ వార్త వచ్చినా నిజానిజాలు తెలుసుకోకుండా నమ్మేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
2 hours ago

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా