newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్షణాల్లో ముఖాలు మార్చేసే డీప్‌ఫేక్ సాఫ్ట్‌వేర్

16-03-202016-03-2020 13:31:23 IST
Updated On 16-03-2020 13:34:00 ISTUpdated On 16-03-20202020-03-16T08:01:23.498Z16-03-2020 2020-03-16T08:01:20.389Z - 2020-03-16T08:04:00.836Z - 16-03-2020

క్షణాల్లో ముఖాలు మార్చేసే డీప్‌ఫేక్ సాఫ్ట్‌వేర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టెక్నాలజీ మానవజీవితాన్ని ఎంత సుఖమయం చేస్తుందో అంత నరకప్రాయం కూడా చేస్తోందనడంలో సందేహమే లేదు. తమకు ఇష్టమైన హీరోలు, గాయకులు, రాజకీయ నేతలను అనుకరిస్తూ వారి ఫోటోలను, వీడియోలను సృష్టించి వినోదం కోసం సోషల్ మీడియాలో పంచుకోవడం అందరూ ఆనందించడం తెలిసిన విషయమే. కానీ వెర్రికాస్త ముదిరితే.. లైకులకోసం ఇష్టారాజ్యంగా సాంకేతికతను ఉపయోగించుకునే దశ నుంచి సెలబ్రిటీల ప్రతిష్టను, పరువు మర్యాదలను పూర్తగా దెబ్దతీసే లక్ష్యంతో పనిచేసి తప్పు సందేశాలు, అసభ్య వీడియోలు సృష్టించడం ద్వారా మనిషి తన పాశవిక ఆనందానికి కొత్త మెరుగులు దిద్దుకుంటున్నాడు. సెలబ్రిటీల ఫేక్ వీడియోలతో ఫోర్ని క్లిప్‌లు తయారు చేసి మరీ వదులుతుండటంతో ఇన్నాళ్లూ సెలబ్రిటీ హోదాను సంతోషంగా స్వీకరించి, హోదాను ఆస్వాదించిన ప్రముఖులు ఈ కొత్త బెడదతో వణికిపోతున్నారు.

ఒక చిన్న ఉదాహరణ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవలే ఆడవారిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వీడియో అమెరికాలో తీవ్రంగా కలకలం రేపింది. తరువాత తనిఖీ చేస్తే అది నకిలీదని తేలింది. అనంతరం ఓ హాలీవుడ్‌ హీరోయిన్‌ పోర్న్‌ క్లిప్‌ ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం.. అందులో ఉన్నది తాను కాదన్నా ఎవరూ నమ్మలేదు. కానీ, ఆమె చెప్పేది నిజమే. మనకు నచ్చిన సెలబ్రిటీల శరీరానికి సామాన్యుల ముఖాలను అంటించి మురిసిపోయే వీలున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పనిచేసే ‘డీప్‌ఫేక్‌’సాఫ్ట్‌వేర్‌ సృష్టిస్తోన్న మాయాజాలమిది. 

ఈ యాప్‌ ప్రపంచంలోకి వచ్చిన కొత్తలో తమకు ఇష్టమైన హీరో, గాయకులు, రాజకీయ నాయకులను అనుకరిస్తూ.. పలు ఫొటోలు, వీడియోలు సృష్టించి, వాటిని సోషల్‌ మీడియా వేదికలపై పంచుకునేవారు. వాటికి వచ్చే లైకులు చూసి సంబరపడిపోయే వారు. అక్కడి వరకే పరిమితమైతే సరిపోయేది. కానీ, కొందరు మరో అడుగు ముందుకేసి.. సంచలనం సృష్టించాలని, తమ టీవీ చానళ్లకు రేటింగులను పెంచాలనే దురుద్దేశంతో డీప్‌ఫేక్‌ను వాడుకుని సెలబ్రిటీల ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు సందేశాలు, అసభ్య వీడియోలు సృష్టించి వాటిని వైరల్‌ చేస్తున్నారు. అవి నకిలీవని నిరూపించుకునేందుకు బాధితులు నానా తంటాలు పడుతున్నారు. 

Image result for New deepfake app pastes your face onto GIFs in seconds

టిక్‌టాక్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌తో డ్యాన్సులు, డబ్‌స్మాష్‌తో భారీ డైలాగులు చెబుతూ చాలామంది సంబరపడిపోతారు కదా! ఈ యాప్‌ కూడా దాదాపు అలాంటిదే. కాకపోతే.. అడ్వాన్స్‌డ్‌ వర్షన్‌. ఎంపిక చేసుకున్న సెలబ్రిటీ, అనుసరించాలనుకున్న ముఖం కవళికలను ఈ సాఫ్ట్‌వేర్‌ ముందే పసిగడుతుంది. మీ బాడీకి ఏ సెలబ్రిటీ శరీరమైతే సరిగ్గా సరిపోతుందో సూచిస్తుంది. దాని ప్రకారం.. మీరు ఏదో వీడియోను చేసి, అందులో మీకు నచ్చిన సందేశం ఇచ్చేయాలి. తరువాత మీ ముఖంపై ఎంపిక చేసుకున్న సెలబ్రిటీ ఫేస్‌ సూపర్‌ ఇంపోజ్‌ అవుతుంది.

అలా.. మీకు నచ్చిన ప్రముఖుల ముఖంలో మీ ముఖం ఇమడ్చడం, లేదా మీ ముఖంలో ప్రముఖుల ముఖం అమర్చే ఆధునిక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఇది. ముఖ కవళికలను ఎవరూ గుర్తుపట్టనంత స్పష్టంగా, నాణ్యంగా ఫొటోలు, వీడియోలు సృష్టించడం దీని ప్రత్యేకత. ఇంకో విషయమేమిటంటే.. ఇందులో సెలబ్రిటీల గొంతుతోనే వీడియో వస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ఫోన్లలోని ప్లేస్టోర్లలో ఈ సాఫ్ట్‌వేర్లను అందించే యాప్‌లు అనేకం ఉన్నాయి. 

వీటిలో చాలా యాప్‌లను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నిషేధించాయి. ఉగ్రవాదులు, సైబర్‌ నేరగాళ్లు ఈ యాప్‌ల సాయంతో మోసాలు, దాడులకు పాల్పడే అవకాశాలున్నాయని, వీటిని నిషేధించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle